మా వాళ్లు మారిపోయారు! మీ పప్పులు మా దగ్గర ఉడకవు... వన్డే వరల్డ్ కప్‌లో విజయం మాదే అంటున్న పాక్ మాజీ...

Published : Aug 05, 2023, 05:33 PM IST

ద్వైపాక్షిక సిరీసుల్లో ఇండియాపై పాకిస్తాన్‌కి ఘనమైన రికార్డు ఉంది. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం పాకిస్తాన్‌పై తిరుగులేని ఆధిక్యంలో ఉంది భారత జట్టు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ వరకూ పాకిస్తాన్, ఇండియాపై వరల్డ్ కప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా గెలవలేకపోయింది..

PREV
18
మా వాళ్లు మారిపోయారు! మీ పప్పులు మా దగ్గర ఉడకవు... వన్డే వరల్డ్ కప్‌లో విజయం మాదే అంటున్న పాక్ మాజీ...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ గ్రూప్ స్టేజీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకున్న పాకిస్తాన్.. అంతకుముందు వచ్చిన పరాజయాలన్నింటికీ కలిపి ఒకేసారి రివెంజ్ తీర్చుకుంది..
 

28

అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌ను ఓడించి, మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచినా విరాట్ కోహ్లీ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్‌ని ఒంటిచేత్తో ఓడించాడు. ఈ మ్యాచ్ తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది..
 

38
Rohit Sharma-Babar Azam

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు శ్రీలంకతో ఆసియా కప్ 2023 టోర్నీ కోసం రెండు లేదా మూడు సార్లు తలబడబోతున్నాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అయితే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి వచ్చిన హైప్, క్రేజ్ వేరే లెవెల్..

48

‘మేం ఆడే రోజుల్లో ప్రెషర్ పెద్ద విషయమే కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి పెద్ద టీమ్‌తో ఆడేటప్పుడు మాత్రమే ప్రెషర్ ఉండేది.  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే వాతావరణం మామూలుగా ఉండదు. ఓ మినీ యుద్దమే జరిగేది. వరల్డ్ కప్ గెలవకపోయినా ఇండియాపై ఎలాగైనా గెలవాలని బోర్డు అధికారులు చెప్పేవాళ్లు..
 

58
Babar Azam

వరల్డ్ కప్ మ్యాచ్ అనగానే ఇండియాకి లొంగిపోయేవాళ్లం. అప్పటిదాకా బాగా ఆడినవాళ్లు కూడా ఇండియాతో మ్యాచ్‌లో చోక్ చేసేవాళ్లు. అయితే ఇప్పుడున్న టీమ్ అలా కాదు. ప్రస్తుతం క్రికెటర్లు పాక్ సూపర్ లీగ్‌తో పాటు అనేక లీగుల్లో పాల్గొంటున్నారు. చాలామంది విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడుతున్నారు..

68
Babar Azam

ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో పాకిస్తాన్‌ టీమ్‌కి బాగా తెలిసింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో వచ్చిన విజయం, టీమిండియా ఆధిపత్యాన్ని మట్టుపెట్టేదే. ఇప్పుడు మావాళ్లు పూర్తిగా మారిపోయారు. పాక్ టీమ్‌తో మీ పప్పులు ఉడకవు.. మా టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు..

78

బాబర్ ఆజమ్, షాహీన్ ఆఫ్రిదీ, ఫకార్ జమాన్, ఇమామ్ వుల్ హక్, మహ్మద్ రిజ్వాన్.. ఇలా చాలామంది ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగలరు. నా అభిప్రాయంలో ఈసారి ఇండియాలో పాకిస్తాన్, టీమిండియాని ఓడించి తీరుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ  క్రికెటర్ వకార్ యూనిస్..  

88

ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే అదే రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో అక్టోబర్ 14న ఇండో-పాక్ మ్యాచ్ జరగవచ్చు.. 

click me!

Recommended Stories