టీమిండియా సెమీస్ చేరితే ముంబైలోనే మ్యాచ్! పాకిస్తాన్‌ సెమీస్‌‌కి వస్తే మాత్రం కోల్‌కత్తాలో... ఎందుకంటే...

Published : Jun 27, 2023, 06:32 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ. అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే 50 ఓవర్ల ప్రపంచ కప్, నవంబర్ 19న ముగియనుంది. ఇండియా మొదటి మ్యాచ్‌లో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాలో ఆడుతోంది..

PREV
17
టీమిండియా సెమీస్ చేరితే ముంబైలోనే మ్యాచ్! పాకిస్తాన్‌ సెమీస్‌‌కి వస్తే మాత్రం కోల్‌కత్తాలో... ఎందుకంటే...
India vs Pakistan

అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే బీభత్సమైన హైప్ వచ్చేసింది..

27

అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో పూణేలో, అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో ధర్మశాలలో మ్యాచ్‌లు ఆడనుంది భారత జట్టు. వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌ని ఓడించి 20 ఏళ్లు దాటిపోయాయి.. చివరిగా 2003 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది టీమిండియా..

37
India vs Pakistan

ఈ విజయం తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లోనే ఓడింది టీమిండియా. 2021 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇండియాపై కివీస్ విజయం సాధించింది. దీంతో ఈసారి కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది భారత జట్టు. 

47

టీమిండియా సెమీ ఫైనల్ చేరితే, మొదటి సెమీ ఫైనల్‌లో ముంబైలో, రెండో సెమీ ఫైనల్‌లో కోల్‌కత్తాలో జరుగుతాయి. ఒకవేళ పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తే మాత్రం ముంబైలో మ్యాచ్ ఆడదు..

57

పాయింట్లతో సంబంధం లేకుండా పాకిస్తాన్‌ ఆడే సెమీ ఫైనల్ మ్యాచ్ కోల్‌కత్తాలో జరుగుతుంది. దీనికి కారణం మహారాష్ట్రలో పాక్ క్రికెట్ టీమ్‌ మ్యాచులు జరిగితే అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని, పాక్ సెక్యూరిటీ విభాగం అభ్యంతరం వ్యక్తం చేయడమే..

67

హైదరాబాద్‌లో రెండు మ్యాచులు ఆడే పాకిస్తాన్, అహ్మదాబాద్‌లో టీమిండియాతో, బెంగళూరులో ఆస్ట్రేలియాతో, చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో, అదే వేదికపై సౌతాఫ్రికాతో మ్యాచులు ఆడుతుంది. కోల్‌కత్తాలో బంగ్లాదేశ్‌తో, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌‌లు ఆడే పాకిస్తాన్, బెంగళూరులో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది..

77

భద్రతా కారణాలతో మహారాష్ట్రలోని ముంబై, ఫూణే నగరాలతో పాటు లక్నో, ధర్మశాల, ఢిల్లీ వంటి నగరాల్లో మ్యాచులు ఆడడం లేదు పాకిస్తాన్. అహ్మదాబాద్‌లో కూడా ఇండియాతో మ్యాచ్ ఒక్కటి మాత్రమే పాక్‌కి షెడ్యూల్ చేయబడింది.. 

click me!

Recommended Stories