ఆర్‌సీబీ కొత్త కోచ్‌గా ఏబీ డివిల్లియర్స్... ఐపీఎల్ 2024కి ముందు ఆ ఇద్దరినీ తొలగించిన బెంగళూరు...

Published : Jul 17, 2023, 01:04 PM IST

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నప్పటికీ 16 సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు ప్లేయర్లను మార్చడం ఆర్‌సీబీకి అలవాటు. ఈసారి కోచింగ్ స్టాఫ్‌ని కూడా మార్చబోతోంది బెంగళూరు..

PREV
16
ఆర్‌సీబీ కొత్త కోచ్‌గా ఏబీ డివిల్లియర్స్... ఐపీఎల్ 2024కి ముందు ఆ ఇద్దరినీ తొలగించిన బెంగళూరు...

ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న మైక్ హుస్సేన్, హెడ్ కోచ్ సంజయ్ భంగర్‌ల కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకుంటున్నట్టు ఆర్‌సీబీ హెడ్ రాజేశ్ మీనన్ ప్రకటించాడు..

26

మైక్ హుస్సేన్, సంజయ్ భంగర్‌ల కాంట్రాక్ట్ గడువు 2023, డిసెంబర్ 31తో ముగియనుంది. ఈ కాంట్రాక్ట్‌ని పొడగించేందుకు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ సిద్ధంగా లేదు. 2021 నుంచి ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా ఉంటున్నాడు సంజయ్ భంగర్..

36

2021 సీజన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్ చేరి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ, 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఓడింది. 2023 సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడి ప్లేఆఫ్స్ బెర్త్‌ని మిస్ చేసుకుంది బెంగళూరు..
 

46
Image credit: RCB/Facebook

సంజయ్ భంగర్ ప్లేస్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్, ఆర్‌సీబీ కోచ్‌గా రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చివరగా 2021 సీజన్‌లో కోహ్లీ కెప్టెన్సీలో ఐపీఎల్ ఆడిన ఏబీ డివిల్లియర్స్, ఆ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు..
 

56

2023 సీజన్‌లో ఆర్‌సీబీ టాలెంట్ స్కాట్‌ హెడ్‌గా పనిచేసిన ఏబీ డివిల్లియర్స్, 2024 సీజన్‌లో కోచింగ్ స్టాఫ్‌లో బాధ్యతలు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే హెడ్ కోచ్‌గా వస్తాడా? లేక బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది..
 

66
Andy Flower

లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్‌, ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆసీస్  మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. దీంతో ఆండీ ఫ్లవర్, ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా రాబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది..

click me!

Recommended Stories