రెండేళ్లుగా వాళ్ల ఆటలో ఏ మార్పు లేదు! పాకిస్తాన్‌పై గౌతమ్ గంభీర్ కామెంట్స్...

First Published | Oct 24, 2023, 6:39 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా 3 మ్యాచుల్లో ఓడింది పాకిస్తాన్. టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా, ఆఫ్ఘాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది. ఈ పరాజయాలతో సెమీస్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది పాకిస్తాన్...
 

India vs Pakistan

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కాదు ఫీల్డింగ్‌లోనూ పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది. ‘పాకిస్తాన్ ఫీల్డింగ్ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆసియా కప్ 2023 టోర్నీలోనూ పాకిస్తాన్ ఇలాంటి ఫీల్డింగే చూపించింది..
 

బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో విఫలం కావడంలో తప్పు లేదు. ఎలాంటి బ్యాటర్ అయినా కొన్నిసార్లు ఫెయిల్ అవుతాడు. కానీ ఫీల్డింగ్ అలా కాదు. ఫీల్డింగ్‌ బాగుపడితేనే మ్యాచులు గెలిచే ఛాన్స్ ఉంటుంది..
 


ఆసియా కప్ నుంచే కాదు, రెండేళ్లుగా వారి ఫీల్డింగ్ ప్రమాణాలు అస్సలు పెరగడం లేదు. పాకిస్తాన్ టీమ్‌ని బాగు చేయాలంటే ముందుగా ఫీల్డింగ్ మెరుపడాలి. ప్రపంచంలోనే వాళ్లు చాలా ఆర్డినరీ ఫీల్డింగ్ ఉన్న జట్టు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..
 

‘ఉపఖండ బ్యాటర్లకు స్పిన్ బౌలింగ్ ఆడడం పెద్ద ఇబ్బంది కాదు. అయితే పాకిస్తాన్ బ్యాటర్లు మాత్రం స్పిన్ బౌలింగ్ ఫేస్ చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు... అదీకాకుండా స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోతున్నారు..
 

పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ ఎవ్వరూ ఒక్క వికెట్ తీయలేకపోయారు. ఇది పాకిస్తాన్ టీమ్‌ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే విషయం...’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్.. 

Latest Videos

click me!