కోట్లు తీసుకుంటున్నారు, ఫిట్‌‌‌గా ఉండలేరా... రోహిత్, పంత్‌లపై పాక్ మాజీ క్రికెటర్ కామెంట్...

First Published Sep 22, 2022, 12:19 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్, శ్రీలంక చేతుల్లో ఓడిన తర్వాత ఆస్ట్రేలియాతోనూ తొలి టీ20 మ్యాచ్‌లోనూ ఓడింది రోహిత్ సేన. 208 పరుగుల భారీ స్కోరు చేసినా ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది టీమిండియా. భారత బౌలర్ల ఫెయిల్యూర్‌తో పాటు ఫీల్డింగ్‌లో టీమిండియా చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది...

Rohit Sharma

టీమిండియా, ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయం చవిచూసిన రోజే ఇంగ్లాండ్ చేతుల్లో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. అయితే తమ దేశం ఆట గురించి మాట్లాడితే చూసేవాడు, పట్టించుకునేవాడు ఉండడని బాగా తెలిసిన పాక్ మాజీ క్రికెటర్లు... వ్యూస్ కోసం పొరుగుదేశం జట్టుపై పడిపోతున్నారు..

Rohit Sharma

పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్, తన యూట్యూబ్ ఛానెల్‌లో భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘భారత క్రికెటర్లు, ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్లు. వాళ్లు పాక్ కంటే ఎక్కువ మ్యాచులు ఆడతారు. అయితే వాళ్లల్లో చాలామంది ఎందుకని ఫిట్‌గా లేరు...

rohit

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు చాలా ఫిట్‌గా ఉంటారు. వారితో పోలిస్తే భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ లెవెల్స్ చాలా తక్కువే. అంతెందుకు ఆసియాలోని కొన్ని దేశాలు కూడా టీమిండియా కంటే ఫిట్‌గా ఉంటాయి. ఎందుకంటే కొందరు భారత క్రికెటర్లు అధిక బరువు ఉన్నారు...

Rishabh Pant

క్రికెటర్లు వికెట్ల మధ్యన పరుగెత్తాలంటే ఫిట్‌గా ఉండాలి. అప్పుడు తేలిగ్గా వేగంగా పరుగులు చేయొచ్చు. మిగిలినవాళ్లు ఈ విషయం గురించి మాట్లాడతారో లేదో నాకు తెలీదు. నా ఉద్దేశంలో మాత్రం ఇప్పుడు టీమిండియా ఫిట్‌నెస్ చెప్పుకోదగ్గంత గొప్పగా అయితే ఏమీ లేదు...

ముఖ్యంగా కొందరు సీనియర్ క్రికెటర్లు ఫీల్డింగ్‌లో చాలా బద్ధకంగా కదులుతున్నారు. ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ మిగిలిన క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తాడు. హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తున్నారు... ఈ ఇద్దరూ కూడా ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు...

అయితే రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ విషయం ఏంటి? ఈ ముగ్గురూ క్రీజులో చురుగ్గా కదలడం లేదు. టాలెంట్ విషయంలో వీరిని కొట్టేవాళ్లు లేరు. అయితే ఫిట్‌నెస్ విషయంలో కేర్ తీసుకుంటే... వీళ్లు మరింత ప్రమాదకర క్రికెటర్లుగా మారతారు...

Harshal Patel

ఉమేశ్ యాదవ్ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను వాడుకోవచ్చు. హర్షల్ పటేల్ 40+ పరుగులు ఇచ్చేశాడు. ఫాస్ట్ బౌలర్‌కి స్లో బాల్స్‌ బలంగా ఉండడం ఏంటోనాకౌతే అర్థం కావడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

click me!