ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్, ఆస్ట్రేలియాకి సూపర్ హిట్... మాథ్యూ వేడ్‌పై ఆశీష్ నెహ్రా కామెంట్...

First Published Sep 22, 2022, 10:49 AM IST

ఐపీఎల్ 2022 టోర్నీలో ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ని ఆరంభించి టైటిల్ సాధించింది గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి స్వదేశీ కోచ్‌గా ఆశీష్ నెహ్రా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన ఆసీస్ ప్లేయర్, వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ మాత్రం ఐపీఎల్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియాకి మ్యాచ్ విన్నర్‌గా మారిన మాథ్యూ వేడ్‌ని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. అతన్ని ఓపెనర్‌గా, వన్‌డౌన్ ప్లేయర్‌గా వాడినా పెద్ద సక్సెస్ కాలేకపోయాడు. 10 మ్యాచుల్లో 157 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా మెరుపులు మెరిపించలేకపోయాడు.

Matthew Wade

‘మాథ్యూ వేడ్ సీజన్ మొత్తం చాలా ఇబ్బంది పడ్డాడు. అతన్ని ఓపెనర్‌గా పంపించాం, మూడో స్థానంలో ఆడించాం... అయినా పెద్దగా సక్సెస్ కాలేదు. అతను ఆస్ట్రేలియాకి 5 లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ కొట్టిన సిక్సర్లు ఇంకా గుర్తున్నాయి...

Matthew Wade

కామెరూన్ గ్రీన్ కూడా అవసరమైతే 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మాథ్యూ వేడ్, ఆస్ట్రేలియా తరుపున ఓపెనింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. టీ20ల్లో ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్ కావాలి. ఓ ప్లేయర్‌, ఎప్పుడు ఎక్కడ క్లిక్ అవుతాడనేది చెప్పడం కష్టం...

Matthew Wade

మాథ్యూ వేడ్‌కి ఆస్ట్రేలియా కలర్స్‌లో ఆడినప్పుడు, లోయర్ ఆర్డర్‌లో ఆడినప్పుడు ఆ అనుభవం బాగా ఉపయోగపడుతోంది. ఆస్ట్రేలియా టీమ్‌ తరుపున అతను కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు. అందుకే ఈజీగా పరుగులు చేయగలుగుతున్నాడు...

భారత బౌలర్లను మాథ్యూ వేడ్ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. ఏ బౌలర్ ఏ బాల్ వేయబోతున్నాడో ముందగానే తెలిసినట్టుగా అతని బ్యాటింగ్ సాగింది. అనుభవమే ఇవన్నీ నేర్పిస్తుంది. టీమిండియా మరో 10 పరుగులు ఎక్కువ చేసినా, మాథ్యూ వేడ్ మ్యాచ్‌ని ముగించేసేవాడు...’అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...
 

18వ ఓవర్‌లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన మాథ్యూ వేడ్, భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాది మ్యాచ్‌ని వన్‌సైడ్ చేసేశాడు. 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, అజేయంగా నిలిచి మ్యాచ్‌ని ముగించాడు. 

click me!