పనిచేయని రోహిత్ ‘అటాకింగ్’ మంత్రం... ప్లాన్ బీ ఫాలో అవ్వాలంటున్న టీమిండియా ఫ్యాన్స్...

First Published Sep 22, 2022, 11:29 AM IST

సాధారణంగా ఏదైనా ఓటమి తర్వాత జట్టుపై అంచనాలు తగ్గుతాయి. అయితే టీ20 వరల్డ్ కప్ 2021లో ఘోర పరాభవం తర్వాత కూడా టీమిండియాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కారణం కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మకు ఐపీఎల్‌లో ఉన్న రికార్డే. 8 సీజన్లలో ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియాని వరల్డ్ ఛాంపియన్‌గా నిలుపుతాడని ఆశించారు అభిమానులు...

Rohit Sharma

విరాట్ కోహ్లీని బ్యాటర్‌గా అభిమానించేవాళ్లు కూడా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని గెలవగలడని నమ్మారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చూపించిన కెప్టెన్సీ స్కిల్స్ దీనికి ప్రధాన కారణం. ఆసియా కప్ 2022 వరకు రోహిత్ సేన తిరుగులేని విజయాలు అందుకుంది..

బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ విఫలమవుతూ వచ్చినా వారి పర్ఫామెన్స్‌లతో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సిరీసుల్లో వరుస విజయాలు అందుకుంది భారత జట్టు. అయితే ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి కథ అడ్డం తిరిగింది...

Rohit Sharma

ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాతో మొదటి టీ20లోనూ ఓడింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా ఎప్పుడూ వరుసగా 3 టీ20 మ్యాచుల్లో ఓడలేదు...

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ‘దూకుడు’ మంత్రం జపిస్తున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మాదిరిగా క్రీజులోకి వచ్చాకే ఆగేదే లేకుండా బాదుడే లక్ష్యంగా ఆడుతున్నారు భారత బ్యాటర్లు. ఆరంభంలో విజయాలు అందించిన ఈ ‘అటాకింగ్’ గేమ్,ఇప్పుడు టీమిండియాకి ముఖ్యంగా రోహిత్ శర్మకు అస్సలు వర్కవుట్ కావడం లేదు...

Image credit: PTI

బ్యాటింగ్‌లో అటాకింగ్ మైండ్‌సెట్‌తో ఆడితే భారీ స్కోరు చేయగలం. అయితే ఎంత స్కోరు చేసినా దాన్ని కాపాడుకోవాలంటే బౌలింగ్‌లో కూడా అటాకింగ్ మైండ్‌సెట్ ఉండాలి. రోహిత్ సేనలో మిస్ అవుతోంది ఇదే. జస్ప్రిత్ బుమ్రా లేకుండా కూడా టీమిండియా విజయాలు అందుకుంది...

Image credit: PTI

ఖలీల్ అహ్మద్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, ఉమేశ్ యాదవ్ వంటి బౌలర్లతో కూడా విజయాలు అందుకున్న భారత జట్టు, ఇప్పుడు ఒకరిద్దరి బౌలర్లపైనే తీవ్రంగా ఆధారపడాల్సి వస్తోంది. షాహీన్ ఆఫ్రిదీ లేకపోయినా భారత జట్టును ఓడించగలిగింది పాకిస్తాన్...

ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా లేకపోతే మ్యాచులు ఓడిపోయినట్టే అనే పరిస్థితికి వచ్చేసింది భారత జట్టు పరిస్థితి. రోహిత్ శర్మ అటాకింగ్ ప్లానింగ్ పెద్దగా వర్కవుట్ కావడం లేదు.ఇప్పుడు ప్లాన్ బీని అమలు చేయాల్సిన అవసరం వచ్చిందంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

ఐపీఎల్‌లో జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ లేకుండా ముంబై ఇండియన్స్ మ్యాచులు గెలవలేకపోవచ్చు. అందులో పెద్దగా ఇబ్బందేమీ లేదు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ హయాంలో అద్భుతాలు చేసిన శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు ఇప్పుడు రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ సారథ్యంలో ఎందుకు అలా రాణించలేకపోతున్నారనే విషయంపై ఫోకస్ పెట్టాలని అంటున్నారు అభిమానులు...

click me!