టీమిండియా విజయానికి ఆ ముగ్గురే కారణం... పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...

First Published Jan 25, 2021, 4:04 PM IST

ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు సాధించిన చారిత్రక విజయం... విమర్శకుల నోళ్లకు తాళాలు వేసింది. ఆడిలైడ్‌లో ఘోర ప్రదర్శన తర్వాత టీమిండియాను ఘోరంగా ట్రోల్ చేసిన పాక్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్, గబ్బా టెస్టు తర్వాత భారత జట్టుకు హ్యాట్సాఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులోకి పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ కూడా చేరాడు.

ఆస్ట్రేలియాలో భారత జట్టు సాధించిన విజయం అద్భుతమని చెప్పిన ఇంజమామ్ వుల్ హక్... టీమిండియా ఓ సూపర్ టీమ్‌లా తయారైందని అన్నాడు...
undefined
‘ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం నిజంగా అద్భుతమైన విజయం... భారత జట్టు చరిత్రలో ఇలాంటి విజయం నేనెప్పుడూ చూడలేదు...
undefined
టీమిండియా ఇంతకుముందు ఎన్నో విజయాలు దక్కించుకొని ఉండవచ్చు కానీ పూర్తిగా అనుభవం లేని బౌలర్లతో దక్కిన విజయం మాత్రం వాటన్నింటికీ మించినది...
undefined
మహ్మద్ సిరాజ్, గిల్, పంత్, శార్దూల్... ఈ సిరీస్‌లో రాణించిన ప్లేయర్లకు పెద్దగా అనుభవం లేదు... చాలామంది ఈ సిరీస్‌లోనే ఆరంగ్రేటం చేశారు...
undefined
గబ్బా టెస్టు విజయం అయితే ఊహించనే లేదు. బుమ్రా, అశ్విన్, జడేజా లేకుండా టీమిండియా యువకులు మ్యాజిక్ చేశారు....
undefined
నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియా డ్రా కోసం ప్రయత్నిస్తుందని అనుకున్నా... కానీ ముందు నుంచి విజయం కోసం ప్రయత్నించింది టీమిండియా...
undefined
రహానే కెప్టెన్సీ అద్భుతం... కానీ ఇది ఒక్క సిరీస్‌తో దక్కిన విజయం కాదు... టీమిండియా సూపర్ పవర్‌గా మారడానికి ముగ్గురు కారణం...
undefined
భారత సారథి విరాట్ కోహ్లీ, అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్, హెడ్ కోచ్ రవిశాస్త్రిలే భారత జట్టు విజయానికి కారణం...
undefined
భారత ప్లేయర్లు సిరాజ్, సైనీ, విహారి, మయాంక్ అగర్వాల్ సక్సెస్ వెనక ద్రావిడ్ ఉన్నారు. భారత్ ఏ జట్టుకి ఆడే సమయంలో వీరిని రాటు దేల్చి, ఏ పరిస్థితుల్లోనైనా ఆడే సత్తా నింపాడు ద్రావిడ్...
undefined
పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వెళ్లిన విరాట్ కోహ్లీ దూకుడు, అతని యాటిట్యూడ్ జట్టులో నింపిన ఉత్సాహం వెలకట్టలేనిది. ఓటమిని అంగీకరంచిన విరాట్ తత్వమే భారత జట్టు ఒంటబట్టించుకుంది...’ అంటూ ప్రశంసించాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్...
undefined
click me!