ఐపీఎల్ ద్వారా రూ.150 కోట్లు... సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న మహేంద్ర సింగ్ ధోనీ...

First Published Jan 25, 2021, 3:19 PM IST

మాజీ కెప్టెన్, సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు మాహీ జీవితం గురించి బయోపిక్ కూడా వచ్చి సూపర్ సక్సెస్ సాధించింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న మాహీ... సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...

ఇప్పటికే 13 సీజన్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఏకైక ప్లేయర్‌గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
2008 సీజన్‌లో ఐపీఎల్ జట్లకి కెప్టెన్లుగా ఉన్న సచిన్, సెహ్వాగ్, యువరాజ్, గంగూలీ, షేన్ వార్న్, ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే క్రికెట్ నుంచి వైదొలిగారు...
undefined
మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్‌కి సారథిగా ఉన్నాడు. సీఎస్‌కేకి బ్యాన్ పడిన రెండేళ్లు పూణెకి కెప్టెన్‌గా ఉన్నాడు ధోనీ...
undefined
2021 ఐపీఎల్ సీజన్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా రూ.150+ కోట్లు సంపాదించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలవబోతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
2008 నుంచి మూడేళ్ల పాటు మహేంద్రసింగ్ ధోనీకి ఏటా రూ.6 కోట్లు చెల్లించింది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
ఆ తర్వాత మూడేళ్లు ఏటా రూ.8.28 కోట్లు కెప్టెన ధోనీ ఖాతాలో వచ్చి చేరాయి... ఆ తర్వాత 2014, 15 సీజన్లలో కెప్టెన్‌కి పారితోషికంగా రూ.12.5 కోట్లు చెల్లించింది సీఎస్‌కే...
undefined
అవినీతి ఆరోపణల కారణంగా 2016, 17 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌పై బ్యాన్ పడిన సంగతి తెలిసిందే. ఈ టైమ్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా ఆడాడు ధోనీ...
undefined
ఈ రెండు సీజన్లకి కలిపి మహేంద్ర సింగ్ ధోనీకి రూ.25 కోట్లు చెల్లించింది రైజింగ్ పూణె...
undefined
2018లో చెన్నై సూపర్ కింగ్స్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పాత పారితోషికానికి మరింత అదనంగా జోడించింది. ఇప్పుడు ఏటా రూ.15 కోట్లు మహీకి చెల్లిస్తోంది సీఎస్‌కే...
undefined
2021 సీజన్‌లో మెగా వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే వచ్చే సీజన్‌లో అదనపు జట్టు చేర్చాలని బీసీసీఐ ఆలోచనతో దానికి బ్రేక్ పడింది... లేకపోతే మాహీ పారితోషికం మరింత పెరిగేదే...
undefined
ఈ ఏడాది ధోనీకి వచ్చే రూ.15 కోట్లతో కలిపి ‘తలైవా’ ఐపీఎల్ ద్వారా సంపాదించిన పూర్తి ఆదాయం రూ.152 కోట్లకు చేరుతుంది...
undefined
ఐపీఎల్2020‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన చివరి గ్రూప్ మ్యాచ్‌కి ముందు కామెంటేటర్ డానీ మోరిసన్... ‘ఎల్లో జెర్సీలో మీకిది చివరి మ్యాచ్ అనుకోవచ్చా’ అని అడిగిన ప్రశ్నకి ధోనీ... ‘డెఫినెట్‌లీ నాట్’ అంటూ సమాధానం ఇచ్చాడు. 2020 సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతారనే వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు ధోనీ...
undefined
ఇప్పటిదాకా ఐపీఎల్‌ ద్వారా అత్యధిక మొత్తం ఆర్జించిన ప్లేయర్ ధోనీయే...
undefined
రెండో స్థానంలో ఉన్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఈ ఏడాది తీసుకునే రూ.15 కోట్లతో కలిపి రూ.146.6 కోట్లకు చేరుకుంటాడు..
undefined
రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ప్లేయర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ... ఈ ఏడాది తీసుకునే రూ.17 కోట్లతో కలిపి రూ.143 కోట్లతో మూడో స్థానంలో ఉంటాడు...
undefined
మొదటి మూడు సీజన్లలో ఏడాదికి కేవలం రూ.1.5 కోట్లు తీసుకున్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్ ఆదాయంలో కాస్త వెనకబడ్డాడు. గత 9 సీజన్లలో అత్యధిక మొత్తం ఆర్జించిన ప్లేయర్ విరాట్ కోహ్లీయే.
undefined
click me!