పాక్ క్రికెట్‌ బోర్డులో సమూల మార్పులు... చీఫ్ సెలక్టర్‌గా షాహిద్ ఆఫ్రిదీ...

First Published Dec 25, 2022, 2:28 PM IST

స్వదేశంలో ఇంగ్లాండ్ చేతుల్లో టెస్టు సిరీస్‌ని కోల్పోయింది పాకిస్తాన్. ఓడిపోవడం అంటే అలా ఇలా కాదు, సొంత మైదానాల్లో ఆడుతూ 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది. ఈ ఓటమితో పాక్ క్రికెట్ బోర్డులో సంచలన మార్పులు జరిగాయి. పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజాపై వేటు పడగా, తాజాగా పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీని ఛీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పాక్...

najam sethi

మూడు రోజుల క్రితం రమీజ్ రాజాని పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ పాక్ క్రికెట్ బోర్డు సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ప్రధాన మంత్రి షాబజ్ షరీఫ్ ఆమోదించాడు. రమీజ్ రాజా స్థానంలో నజమ్ సేతీ, పీసీబీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నాడు..  

పాక్ జర్నలిస్ట్, బిజినెస్ మ్యాన్ అయిన నజమ్ అజిజ్ సేథీ, ‘ది ఫ్రైడే టైమ్స్’ పత్రికను స్థాపించాడు. ఇంతకుముందు పాక్ క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా వ్యవహరించిన నజమ్ సేథీ, పాక్ ఆక్రమిత పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ పనిచేశాడు.. 

రమీజ్ రాజా, పీసీబీ ప్రెసిడెంట్‌గా తిరిగి బాధ్యతలు తీసుకోవడంతోనే పాక్ నుంచి బయటికి వెళ్లిపోయిన మహ్మద్ అమీర్ వంటి మాజీ క్రికెటర్లు మళ్లీ పాక్‌లో అడుగుపెట్టారు. రమీజ్ రాజాతో పాటు పీసీబీ సెలక్షన్ బోర్డుపై కూడా వేటు వేసింది పాకిస్తాన్...

shahid

పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీని తాత్కాలిక ఛీఫ్ సెలక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పాక్ క్రికెట్ బోర్డు. ఐదు సార్లు రిటైర్మెంట్ ఇచ్చి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆఫ్రిదీ... 2020 వరకూ పాక్ సూపర్ లీగ్‌లో పాల్గొన్నాడు...

afridi

షాహిద్ ఆఫ్రిదీని ఛీఫ్ సెలక్టర్‌గా నియమించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి... పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా... ‘ఛీఫ్ సెలక్టర్’ అంటూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ‘వీడు చీఫ్ సెలక్టర్‌ ఆ... ’ అని నవ్వుతున్నట్టుగా ఎమోజీలు జత చేశాడు డానిష్ కనేరియా...

afridi

ప్రస్తుతం పాకిస్తాన్ ఛీఫ్ సెలక్టర్‌గా ఉన్న మహమ్మద్ వసీంని, షాహిద్ ఆఫ్రిదీ రిప్లేస్ చేయబోతున్నాడు. ఇంగ్లాండ్ చేతుల్లో ఘోర ఓటమి తర్వాత పాక్‌ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా పనికి రాడని ట్రోల్ చేస్తున్నారు పాక్ ఫ్యాన్స్...

‘బాబర్ ఆజమ్ మన కెప్టెన్, అతను కెప్టెన్‌గానే ఉంటాడు. మన టీమ్‌కి సపోర్ట్ చేయండి. ఈ జట్టు గెలవగలదు. కథ ఇంకా అయిపోలేదు...’ అంటూ షాహిదీ ఆఫ్రిదీ ట్వీట్ చేశాడు. అయితే తాత్కాలిక సెలక్టర్‌గా నియమిస్తున్నట్టు నిర్ణయం వెలువడగానే ఈ ట్వీట్‌ని డిలీట్ చేశాడు ఆఫ్రిదీ.. 

click me!