టాప్ 2లో టీమిండియా... ఆ ఒక్క సిరీస్ గెలిస్తే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి! ఈసారి ఆస్ట్రేలియాతో...

First Published Dec 25, 2022, 12:40 PM IST

బంగ్లాదేశ్‌ టూర్‌లో రెండు టెస్టుల సిరీస్‌ని 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా రవిచంద్రన్ అశ్విన్- శ్రేయాస్ అయ్యర్ అద్భుత పోరాటంతో రెండో టెస్టులో గెలిచింది భారత జట్టు...

రెండో టెస్టులో దక్కిన విజయంతో టీమిండియా విన్నింగ్ పర్పెంటేజ్ 58.93కి చేరుకుంది. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో ఇప్పటికే 14 మ్యాచులు ఆడిన భారత జట్టు 8 టెస్టులు గెలిచి నాలుగింట్లో ఓడింది. రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి...

టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా ప్రస్తుతం 76.92 శాతం విజయాలతో ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా, తొలి టెస్టులో ఘన విజయం అందుకుంది. మిగిలిన రెండు టెస్టుల్లోనూ సేమ్ రిజల్ట్ రిపీట్ చేస్తే... ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 80+కి చేరుతుంది...

సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టెస్టుల్లో గెలిస్తే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ని దాదాపు కన్ఫార్ట్ చేసుకుంటుంది ఆస్ట్రేలియా. అలాగే 54.55 విజయ శాతంతో మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా, మిగిలిన రెండు టెస్టుల్లో ఓడితే ఐదో స్థానానికి పడిపోతుంది...

ఆస్ట్రేలియాలో  ఆస్ట్రేలియాని ఓడించడం అంత తేలికైన విషయం కాదు. అదీకాకుండా తొలి టెస్టులో చిత్తుగా ఓడిన తర్వాత సౌతాఫ్రికా, రెండో టెస్టులో ఎలాంటి కమ్‌బ్యాక్ ఇస్తుందో చెప్పడం కష్టం. రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, వచ్చే ఏడాది ఫ్రిబవరిలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడబోతోంది...

Australia vs India

టీమిండియా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కీలకంగా మారనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 4-0. 3-1, 3-0, 2-0 తేడాతో విజయం అందుకుంటే... ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండింట్లో ఓడినా టీమిండియా ఫైనల్ ఛాన్సులు సన్నగిల్లుతాయి. మిగిలిన దేశాల మ్యాచులతో ఆధారపడాల్సి ఉంటుంది...

ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే ముందుగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌ని గెలవాల్సి ఉంటుంది. గత రికార్డుల ప్రకారం చూసుకుంటే స్వదేశంలో ఆసీస్‌ని ఓడించడం టీమిండియాకి పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాని స్వదేశంలో ఓడించడం కూడా ఆస్ట్రేలియాకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు... 

India vs Bangladesh

పసికూన బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనే చుక్కలు చూసిన టీమిండియా, ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్‌ని తట్టుకుని నిలబడగలరా? గాయలతో జట్టుకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.. తిరిగి టీమ్‌లోకి వస్తారా? వచ్చే ఏడాదిలోకి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకనున్నాయి...

click me!