రాహుల్ కంటే అశ్విన్‌ లేదా అయ్యర్‌కి టెస్టు కెప్టెన్సీ ఇవ్వడం బెటర్... ఘోర ఓటములను తప్పించి...

First Published Dec 25, 2022, 1:38 PM IST

బంగ్లాదేశ్ టూర్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడినా వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి విజయంతో సిరీస్‌ని ముగించింది టీమిండియా... బంగ్లా టూర్‌లో ఓడిన రెండు మ్యాచులకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించగా గెలిచిన మూడు మ్యాచుల్లో కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయినా రాహుల్‌పై విమర్శల వర్షం కురుస్తుండడం విశేషం...

బంగ్లాదేశ్ టూర్‌లో తొలి టెస్టులో దక్కిన విజయమే టెస్టు కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌కి తొలి గెలుపు. ఈ విజయంతో విదేశాల్లో వన్డే, టీ20, టెస్టు మ్యాచులు గెలిచిన భారత కెప్టెన్‌గా సెహ్వాగ్, ధోనీ, విరాట్ కోహ్లీ, అజింకా రహానేల రికార్డును సమం చేశాడు కెఎల్ రాహుల్...

ashwin

రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచి, ఊపిరి పీల్చుకుంది భారత జట్టు. బంగ్లాదేశ్‌పై 2-0 తేడాతో టెస్టు సిరీస్ గెలిచాడు కెప్టెన్ కెఎల్ రాహుల్. అయితే రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా కొన్ని చెత్త రికార్డులను నెలకొల్పింది..

Image credit: Getty

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 113.2 ఓవర్లు బ్యాటింగ్ చేసింది బంగ్లాదేశ్. భారత్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 100 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200+ స్కోరు చేసింది బంగ్లా. భారత్‌పై బంగ్లా రెండు ఇన్నింగ్స్‌ల్లో 200 దాటడం కూడా ఇదే తొలిసారి..

Ashwin

చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ వీరోచిత పోరాటం వల్ల టీమిండియా గెలిచి ఊపిరి పీల్చుకుంది. లేకపోతే బంగ్లా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది...

కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ మెప్పించలేకపోయాడు కెఎల్ రాహుల్. రాహుల్ కంటే శ్రేయాస్ అయ్యర్, లేదా సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టు కెప్టెన్సీ అప్పగించడం అన్ని విధాల సమంజసంగా ఉంటుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

88 టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో 3 వేలకు పైగా పరుగులు, 400+ వికెట్లు తీసిన అతికొద్ది మంది ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఉన్నాడు. అశ్విన్‌కి ఈ వయసులో టెస్టు కెప్టెన్సీ ఇవ్వడం అతని అనుభవానికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు కొందరు అభిమానులు...

అశ్విన్‌కి టెస్టు కెప్టెన్సీ ఇచ్చి, శ్రేయాస్ అయ్యర్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించాలని అంటున్నారు. అశ్విన్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత శ్రేయాస్ అయ్యర్‌కి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పచెబితే కరెక్టుగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు..

అయితే బంగ్లా టూర్‌లో మూడు విజయాలు అందించిన కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై బీసీసీఐకి పూర్తి నమ్మకం వచ్చినట్టు, అతనే టీమిండియా ఫ్యూచర్ టెస్టు కెప్టెన్‌గా ఫిక్స్ అయిపోయారని టాక్..

click me!