ఆరు నెలల పసిబిడ్డతో వరల్డ్ కప్‌‌కి... ఆదర్శంగా నిలుస్తున్న పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్...

Published : Mar 06, 2022, 03:11 PM IST

క్రికెట్‌కి పెళ్లి, పిల్లలు అడ్డం అవుతారని భావిస్తారు చాలామంది మహిళా క్రికెటర్లు. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ మాత్రం ఈ అభిప్రాయాన్ని తప్పని నిరూపిస్తోంది. 

PREV
111
ఆరు నెలల పసిబిడ్డతో వరల్డ్ కప్‌‌కి... ఆదర్శంగా నిలుస్తున్న పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్...

పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన బిస్మా మరూఫ్... ఆరు నెలల తన కూతురితో కలిసి వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది...

211

వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ప్రాక్టీస్ చేస్తున్న పాకిస్తాన్ మహిళా జట్టులో ఫాతిమా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది... క్యాంపులో ఓ కొత్త ఎనర్జీని నింపుతోంది...

311

ఫాతిమా ఎవరో కాదు, పాక్ వుమెన్స్ టీమ్ కెప్టెన్ బిస్మా మరూఫ్ ఆరు నెలల కూతురు. ఫాతిమాని అందరూ ముద్దుగా ‘బాబ్బూజీ’ అని పిలుస్తున్నారు పాక్ ప్లేయర్లు...

411

‘చాలామంది ప్లేయర్లు, ఫాతిమాతో ఆడుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తనని ఎత్తుకోవాలని, ఆడుకోవాలని  పోటీపడుతున్నారు...

511

ఫాతిమా రాకతో టీమ్‌లో కొత్త వైబ్రేషన్స్ వచ్చాయి. స్ట్రెస్ అనేది లేకుండా ఎంతో హ్యాపీగా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు...’ అని తెలిపింది పాక్ సీనియర్ ప్లేయర్ నిదా దర్...

611

ప్రసవం తర్వాత తిరిగి ఫిట్‌నెస్ సాధించి, క్రీజులో దిగిన బిస్మా మరూఫ్, బ్యాటింగ్, కెప్టెన్సీతో పాటు తల్లిగా తన బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తోంది...

711

తల్లి అయిన తర్వాత అందరూ మానసిక ఒత్తిడి పెరుగుతుందని అనుకుంటారని, తనకు మాత్రం బిడ్డ పుట్టిన తర్వాత చాలా మెంటర్ పీస్ దక్కుతోందని అంటోంది బిస్మా మరూఫ్...

811

‘నేను ప్రాక్టీస్‌కి వచ్చే సమయానికి ఫాతిమా నిద్రలేవకుండా చూసుకుంటాను. ఒకవేళ తను లేచి ఉంటే, ఫాతిమాతో పాటు మా అమ్మ కూడా ప్రాక్టీస్ సెషన్స్‌కి వస్తుంది...

911

‘పెళ్లైన తర్వాత క్రికెటర్‌గా కొనసాగగలనని అనుకోలేదు. బిడ్డ పుట్టిన తర్వాత క్రికెట్‌ని వదిలేయాల్సి వస్తుందని కూడా భయపడ్డాను...

1011

కానీ నా కుటుంబసభ్యుల సహకారంతో ఇది సాధించగలిగాను. ముఖ్యంగా నా భర్త, తల్లైన తర్వాత కూడా క్రికెటర్‌గా రాణించాలనుకునేవారికి నేను ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు... నేను దాన్ని సాధ్యం చేశా...’ అంటూ చెప్పుకొచ్చింది బిస్మా మరూఫ్... 

1111

వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో భారత ప్లేయర్లు కూడా డ్రెస్సింగ్ రూమ్ దగ్గర బిస్మా మరూఫ్ కూతురు ఫాతిమాతో ఆడుకోవడం కెమెరాల్లో కనిపించింది...

click me!

Recommended Stories