టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నాటి సంగతి. టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత పురుషుల జట్టు, దాయాది పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో పరాభవాన్ని మూటకట్టుకుంది. అయితే ఐదు నెలల గ్యాప్‌లో పాక్‌పై కసి తీరా ప్రతీకారం తీర్చుకుంది మిథాలీ సేన...
భారత పురుషుల జట్టులాగే వన్డే వరల్డ్ కప్ 2022 వార్మప్ మ్యాచుల్లో మిథాలీసేన, రెండు అద్భుత విజయాలను అందుకుంది...
212
దీంతో టోర్నీ మొదలయ్యేసరికి మనోళ్ల పర్ఫామెన్స్, పురుషుల టీమ్‌లాగే ఊసురుమనిపిస్తుందేమోనని అనుమానించారు క్రికెట్ ఫ్యాన్స్...
312
అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ దాయాది పాకిస్తాన్‌పై అద్భుత పర్ఫామెన్స్ ఇచ్చి, ఘన విజయంతో టోర్నీని మొదలెట్టింది భారత మహిళా జట్టు...
412
114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాత స్నేహ్ రాణా, పూజా వస్తాకర్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ కారణంగా 244 పరుగుల స్కోరు చేయగలిగింది...
512
ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంతో భారత బౌలర్లు అద్భుతమే చేశారు. 28 పరుగుల దగ్గర తొలి వికెట్ తీసిన భారత బౌలర్లు, వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పాక్‌ను కోలుకోనివ్వలేదు...
612
రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీయగా స్నేహ్ రాణా, జులన్ గోస్వామి రెండేసి వికెట్లు తీశారు. 137 పరుగులకే పాక్‌ను చుట్టేసిన భారత జట్టు 107 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుని, టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లింది...
712
పాకిస్తాన్‌పై భారత జట్టుకి ఇది వరుసగా 11వ విజయం... వుమెన్స్ వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో వరుసగా నాలుగో విజయం...
812
పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచిన 11 వన్డేలు కూడా మిథాలీ రాజ్ కెప్టెన్సీలో ఆడినవే కావడం విశేషం. 2005 నుంచి పాక్‌పై ఓటమి లేకుండా వరుస విజయాలు అందుకుంటోంది భారత మహిళా జట్టు...
912
2017 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్, పాక్‌పై 4 వికెట్లు తీసి వరల్డ్ కప్ టోర్నీలో రెండు సార్లు 4+ వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా నిలిచింది...
1012
నేటి మ్యాచ్‌లో నాలుగు క్యాచులు అందుకున్న వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆరంగ్రేటం మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
1112
భారత పురుషుల జట్టు, పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తీయలేక చిత్తుగా ఓడిత, భారత మహిళా జట్టు, ఒక్క పాక్ బ్యాటర్‌ని కూడా 40+ స్కోరు చేయనివ్వకుండా దుమ్మురేపింది...
1212
10 వికెట్ల తేడాతో టీమిండియాని ఓడించామని తెగ విర్రవీగిన పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఈ విజయంతో దిమ్మతిరిగే సమాధానం చెప్పేసిన మిథాలీ సేనకు ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అంటూ పోస్టులు పెడుతున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్...