షాహీన్ ఆఫ్రిదీ ప్లేస్‌లో నిషేధిత బౌలర్‌‌ని పట్టుకొచ్చిన పాక్... ఆసీస్ బ్యాన్ వేసిన మహ్మద్ హస్నైన్‌కి...

Published : Aug 22, 2022, 02:10 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2021 పరాభవం తర్వాత రెండు జట్లు తొలిసారి తలబడుతుండడంతో ఈ మ్యాచ్‌కి ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. టికెట్లు హాట్ కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి...

PREV
18
షాహీన్ ఆఫ్రిదీ ప్లేస్‌లో నిషేధిత బౌలర్‌‌ని పట్టుకొచ్చిన పాక్... ఆసీస్ బ్యాన్ వేసిన మహ్మద్ హస్నైన్‌కి...
shaheen

ఆసియా కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ గాయంతో తప్పుకున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో పాల్గొన్న షాహీన్ ఆఫ్రిదీ, మోకాలి గాయంతో బాధపడుతుండడంతో అతనికి కనీసం రెండు నెలల విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు...

28
shaheen

ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఆ తర్వాత జరిగే ఇంగ్లాండ్, పాకిస్తాన్ టీ20 సిరీస్‌కి కూడా షాహీన్ ఆఫ్రిదీ దూరంగా ఉండబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 సమయానికి షాహీన్ ఆఫ్రిదీ కోలుకుని, టీమ్‌కి అందుబాటులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది పాక్ క్రికెట్ బోర్డు...

38

తాజాగా గాయపడిన షాహీన్ ఆఫ్రిదీ స్థానంలో రిప్లేస్‌మెంట్ నిషేధిత బౌలర్‌ని పట్టుకొచ్చింది పాకిస్తాన్. 21 ఏళ్ల యంగ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ హస్నైన్‌, ఆఫ్రిదీ స్థానంలో ఆసియా కప్ 2022 టోర్నీ ఆడబోతున్నాడు. ఇప్పటిదాకా పాక్ తరుపున 18 టీ20 మ్యాచులు ఆడిన మహ్మద్ హస్నైన్, 17 వికెట్లు పడగొట్టాడు...

48
Image credit: Getty

అయితే ఈ ఏడాది ఆరంభంలోనే మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని తేలడంతో అతనిపై నిషేధం విధించింది పాక్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ జట్టు తరుపున 8 వన్డేలు, 18 టీ20 మ్యాచులు ఆడి... వన్డేల్లో 12 వికెట్లు తీసిన మహ్మద్ హస్నైన్, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)తో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బిగ్‌ బాష్ లీగ్‌లో ఆడుతున్న మహ్మద్ హస్నైన్, ప్రస్తుతం ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఆడుతున్నాడు.

58
Image Credit: Getty Images

ఫిబ్రవరిలో జరిగిన బీబీఎల్ 2022 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరుపున ఆడిన మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుమానాలు రావడంతో ఐసీసీకి ఫిర్యాదు చేశారు అంపైర్ గెరార్డ్ అబూద్... బీబీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి వెళ్లే ముందు క్రికెట్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఐసీసీ, హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ను సమీక్షించింది...

68
Mohammad Hasnain

ఈ సమీక్షకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అనుమతించింది. అయితే ఈ సమీక్షలో మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్, ఐసీసీ నియమావళికి విరుద్ధంగా ఉందని నిర్ధారించారు. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరుపున ఆడుతున్న మహ్మద్ హస్నైన్‌ని ఆఖరి నిమిషంలో తుది జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది...

78
Mohammad Hasnain

‘మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్‌ని అన్ని విధాలుగా సమీక్షించడం జరిగింది. అతని బౌలింగ్ యాక్షన్, ఐసీసీ చట్ట విరుద్ధంగా ఉందని నిర్ధారణ అయింది. అతని బౌలింగ్ యాక్షన్‌లో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాల్సిందిగా అతనికి ఇప్పటికే సూచించాం... లేకపోతే మహ్మద్ హస్నైన్ ఎప్పటికీ బౌలింగ్ చేయలేడు...’ అంటూ తెలిపాడు క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ పీటర్ రోచ్...

88
Muhammad Hasnain

క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని స్వీకరించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, మహ్మద్ హస్నైన్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. అతని బౌలింగ్‌ను పర్యవేక్షిస్తూ, అవసరమైన మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఓ బౌలింగ్ కన్సల్టెంట్‌ను త్వరలో నియమించబోతున్నట్టు ప్రకటించింది పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)... జూన్‌లో తన బౌలింగ్ యాక్షన్‌పై క్లియరెన్స్ తెచ్చుకున్న హస్నైన్, క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు...

click me!

Recommended Stories