పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్... బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా...

First Published Jun 22, 2021, 2:57 PM IST

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఊహించని షాక్ తగిలింది. మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్, పాకిస్తాక్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు... దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది...

రెండేళ్ల పాటు బ్యాటింగ్ కోచ్‌గా కాంట్రెక్ట్ సంతకం చేసిన మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్, కేవలం ఆరు నెలలకే తన పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం...
undefined
బ్యాటింగ్ కోచ్ పదవికి యూనిస్ ఖాన్ రాజీనామా సమర్పించడంతో ఇంగ్లాండ్, వెస్టిండీస్ టూర్లకు అతను వెళ్లడం లేదు. ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడే పాక్, ఆ తర్వాత విండీస్ సిరీస్ ఆడుతుంది.
undefined
మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ముస్తాఫ్ అస్మాద్‌లను నియమించింది. అయితే కొన్నాళ్లుగా పీసీబీలో గొడవలు జరుగుతున్నాయి.
undefined
గత ఏడాది బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పీసీబీతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన యూనిస్ ఖాన్, ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్‌గా కాంట్రాక్ట్ పొందాడు. 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ అతని కాంట్రాక్ట్ సాగాల్సి ఉంది...
undefined
యూనిస్ ఖాన్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్ సీనియర్లు మంచి పర్ఫామెన్స్ చూపించారు. అయితే బాబర్ ఆజమ్ మాత్రం టెస్టుల్లో వరుసగా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. వన్డేల్లో నెం.1 ర్యాంకుని పొందిన బాబర్ ఆజమ్ కెప్టెన్సీలో పాక్, జింబాబ్వే, సౌతాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచింది.
undefined
జాతీయ క్రికెట్ అకాడమీని అభివృద్ధి చేసేందుకు యూనిస్ ఖాన్‌తో చర్చలు జరిపింది పీసీబీ. అయితే ఆ చర్చలు సఫలం కాలేదు...
undefined
మొదట యూనిస్ ఖాన్‌ని మెంటర్‌గా, కోచ్‌గా తీసుకునేందుకు మొగ్గు చూపిన పాక్ క్రికెట్ బోర్డు, ఆఖరికి అతనికి బ్యాటింగ్ కోచ్ పదవిని మాత్రమే అప్పగించింది.
undefined
తన జూనియర్ మిస్బావుల్ హక్‌ను హెడ్ కోచ్‌గా నియమించడం, తనను బ్యాటింగ్ కోచ్‌గా నియమించడంపై యూనిస్ ఖాన్ నిరుత్సాహంగా ఉన్నట్టు సమాచారం.
undefined
click me!