'సహజంగానే ఇది చాలా కష్టం' అని రాహుల్ పేర్కొన్నాడు. "మీకు మీ స్వంత వ్యక్తిత్వం, వ్యక్తిత్వ లక్షణాలు, లక్షణాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు వారందరికీ సవాళ్లు ఎదురవుతాయి. ఒక వ్యక్తిగా, క్రికెటర్ గా, వ్యక్తిగతంగా ప్రతిరోజూ, ప్రతి క్షణం సవాళ్లను ఎదుర్కొంటారు. సోషల్ మీడియా అంటేనే ఒత్తిడి. ఈ రోజు నేను సెంచరీ సాధించాను, కాబట్టి ప్రజలు ప్రశంసలు కురిపిస్తుననారు. మూడు నాలుగు నెలల క్రితం అందరూ నాపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఆటలో భాగం, కానీ ఇది మిమ్మల్ని ప్రభావితం చేయదని నేను చెప్పలేను.. దీనికి దూరంగా ఉండటం మీ ఆటకు, మీ మైండ్సెట్ కు మంచిదని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది' అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. దినచర్యను పాటించడం, సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి ఒక గీత గీయడం చాలా ముఖ్యమని రాహుల్ నొక్కి చెప్పారు. గాయంతో దూరంగా ఉన్నప్పుడు, బయటి ఒత్తిడిని తట్టుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ తాను తన వ్యక్తిత్వం, చేయాల్సిన పని గురించి మాత్రమే దృష్టి పెట్టడంతో ముందుకు వెళ్లానని చెప్పాడు.