KL Rahul
KL Rahul Hits Hundred in Centurion: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్స్ పెద్దగా రాణించని సెంచూరియన్ లో కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
KL Rahul
మరే బ్యాటర్ కు సాధ్యం కానీ సెంచరీలను నమోదుచేశాడు. సెంచూరియన్ లో రెండు టెస్టు సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో రాహుల్ 137 బంతుల్లో 101 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉండటం విశేషం.
భారత్ జట్టు 107 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్.. లోయర్ ఆర్డర్ & టైలెండర్లతో భాగస్వామ్యం నెలకొల్పి అద్భుతమైన సెంచరీని కొట్టాడు. దక్షిణాఫ్రికాలో ఒక భారత ప్లేయర్ చేసిన అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఇది.
వన్డేల్లో ఓపెనింగ్.. మిడిలార్డర్, వికెట్ కీపింగ్; టెస్టుల్లో ఓపెనింగ్.. మిడిల్ ఆర్డర్, వికెట్ కీపింగ్; టీ20ల్లో ఓపెనింగ్, వికెట్ కీపింగ్.. ఇలా ఏ స్థానంలో ఉన్నా తనదైన స్టైల్లో కేఎల్ రాహుల్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
కేఎల్ రాహుల్ ఈ సెంచరీ ఇన్నింగ్స్ తో మరో విశేషం.. ఎక్కువ పరుగులు బౌండరీలతో సాధించడం. 79.20 శాతం (80 పరుగులు) బౌండరీలతో నే సాధించాడు. ఈ లిస్టులో శిఖర్ ధావన్ టాప్ లో ఉండగా, 2018లో ఆఫ్ఘానిస్థాన్ పై సాధించిన 107 పరుగులలో 94 పరుగులను బౌండరీలతో వచ్చాయి. అలాగే, న్యూజిలాండ్ పై వీవీఎస్ లక్ష్మణ్ 2009లో 124* పరుగులలో 100 పరుగులు బౌండరీలతో సాధించాడు.