రాక్ సాలిడ్ డిఫెన్స్, సూప‌ర్ బౌండ‌రీల‌తో అదరగొట్టిన కేఎల్ రాహుల్..

First Published | Dec 27, 2023, 4:04 PM IST

KL Rahul Century: దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన కేఎల్ రాహుల్ పై మాజీ స్టార్ క్రికెట్ ప్లేయ‌ర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు.
 

KL Rahul

india vs south africa test: క్లిష్టమైన సెంచూరియన్ పిచ్ పై వీరోచిత సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు.

బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ దెబ్బకు భారత్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 5 వికెట్లు తీసుకున్న ర‌బాడ‌,  భారత బ్యాటింగ్ లైనప్ పతనానికి కారణమయ్యాడు. 
 


అయితే, సెంచూరియన్ లో కేఎల్ రాహుల్ నిలకడైన ప్రదర్శన చేయకపోతే జట్టు మొదటి రోజు పూర్తి ఆలౌట్ పరిస్థితిని ఎదుర్కొనేది. కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ లో రాహుల్ 105 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేశాడు. 5 వికెట్ల నష్టానికి 107 పరుగులతో క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ తో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులకు తొలి రోజు ఆట ముగించింది. 
 

ఇక రెండో రోజు ఆట‌ను కొన‌సాగించిన భార‌త్.. రాహుల్ అద్భుత సెంచ‌రీలో 245 ప‌రుగులు చేసింది. ఇక 101 ప‌రుగుల‌తో రాణించిన రాహుల్ బ్యాటింగ్ ను ఇర్ఫాన్ ప‌ఠాన్ ప్రశంస‌లు కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రాహుల్ ఆటతీరును కొనియాడారు.
 

'అద్భుతమైన ఎత్తుగడలు, మైదానంలో అద్భుతమైన షాట్లు ఆడాడ‌ని పేర్కొన్నాడు. రాక్-సాలిడ్ డిఫెన్స్, సూప‌ర్ బౌండ‌రీల‌తో కేఎల్ రాహుల్ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించాడ‌ని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
 

తన టెస్టు క్రికెట్ కెరీర్  లో కేెఎల్ రాహుల్ టాప్-3లో బ్యాటింగ్ కు రాకపోవడం ఇదే తొలిసారి. టెస్టు క్రికెట్ లో అపరిచిత బ్యాటింగ్ పొజిషన్ లో ఉన్నప్పటికీ రాహుల్ చెప్పుకోదగ్గ ప్రభావం చూపించాడు.
 

Latest Videos

click me!