వన్డేల టైమ్ అయిపోయింది! ఇక వాటినెవరు చూస్తారు... భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కామెంట్..

First Published Jan 20, 2023, 12:40 PM IST

వన్డేల్లో రోహిత్ శర్మ 264 పరుగులు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసినప్పుడు నాన్ స్ట్రైయికర్‌లో ఉన్నాడు రాబిన్ ఊతప్ప. రోహిత్ శర్మ బౌండరీలతో ఇరగదీస్తుంటే మరో ఎండ్‌లో రాబిన్ ఊతప్ప 16 బంతుల్లో 16 సింగిల్స్ తీసి కేవలం స్ట్రైయిక్ ఇవ్వడానికే ఆడుతున్నట్టు ఆడాడు...

టీమిండియా తరుపున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 2015 తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2022 సెప్టెంబర్ 14న 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఊతప్ప, ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ (ఐఎల్‌టీ 20)లో పాల్గొంటున్నాడు...

ఐఎల్‌టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ (డీసీ) తరుపున ఆడుతున్న రాబిన్ ఊతప్ప, క్రికెట్ భవిష్యత్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మారుతున్న మనిషి అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా క్రికెట్ కూడా మారుతూ వచ్చింది.. ఫుట్‌బాల్ మాదిరిగానే ఇప్పుడు క్రికెట్‌లో ఫ్రాంఛైజీ లీగులకు క్రేజ్ పెరిగింది...

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రతీ క్రికెటర్‌కి అవకాశం దక్కుతోంది. భవిష్యత్తులో వన్డే క్రికెట్‌కి కాలం చెల్లుతుంది. ఇకపై ఆ మ్యాచులు చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పటికే జనాల్లో వన్డేలంటే విసుగు వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది...

టీ20, టెస్టులకు మాత్రం క్రేజ్ అలాగే ఉంటుంది. టీ10 క్రికెట్ కూడా భవిష్యత్తును శాసిస్తుంది. చిన్న దేశాలు, అసోసియేటేట్ దేశాలకు టీ10 ఫార్మాట్ బాగా ఉపయోగపడుతుంది. క్రికెట్ కూడా సూపర్ ఫాస్ట్ డైరెక్షన్‌ని అలవర్చుకుంటోంది...

జనాలు దేన్ని ఎక్కువగా చూడడానికి ఆసక్తి చూపిస్తారో క్రికెటర్లు అదే ఆడాలి. చూడని మ్యాచులకు వ్యూయర్‌షిప్ మాత్రమే కాదు, స్పాన్సర్లు కూడా ఉండరు. వన్డే మ్యాచుల కోసం 7, 8 గంటలు కూర్చొనే ఓపిక జనాలకు లేదు.. అంతా టీ20, టీ10 వంటి సూపర్ ఫాస్ట్ ఫార్మాట్లకు అలవాటు పడ్డారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప... 

click me!