మేం రాకూడదనే అక్కడ పెట్టారు... వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌పై పీసీబీ ఛైర్మెన్...

Published : May 17, 2023, 08:57 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆసియా కప్ 2023 టోర్నీని పాక్‌లో నిర్వహించి, ఇండియా ఆడితేనే మేం వరల్డ్ కప్ ఆడతామని అంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పీసీబీ బెదిరింపులకు బీసీసీఐ లొంగే ప్రశక్తే లేదు...

PREV
18
మేం రాకూడదనే అక్కడ పెట్టారు... వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌పై పీసీబీ ఛైర్మెన్...
Image credit: PTI


పాకిస్తాన్‌లో భద్రతా కారణాలను సాకుగా చెబుతూ ఆసియా కప్ 2023 టోర్నీ వేదిక మార్చాల్సిందిగా పట్టుబడుతోంది బీసీసీఐ. భారత బోర్డు ఆదేశాలతో బంగ్లాదేశ్, శ్రీలంక కూడా పాక్ నుంచి ఆసియా కప్ 2023 టోర్నీని తరలించాల్సిదేనని పట్టుబడుతున్నాయి..
 

28

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంటే, నష్టపరిహారంగా రూ.200 మిలియన్ డాలర్లు (పాక్ కరెన్సీలో దాదాపు 5 వేల కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. దీంతో పాక్, ఇండియాకి రావడం దాదాపు ఖాయమే..

38

‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని అహ్మదాబాద్‌లో పెడుతున్నారనే వార్త వినగానే నవ్వొచ్చింది. మేం ఇండియాకి రాకుండా చేసేందుకు ఇది కూడా ఓ మార్గంగా అనిపించింది. ఎందుకంటే కోల్‌కత్తా లేదా చెన్నై, హైదరాబాద్‌ల్లో మ్యాచ్ పెట్టొచ్చు.. 

48
virat kohli

రాజకీయాల గురించి నేను మాట్లాడను కానీ మాకు ఏ నగరంలో అయినా సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయంటే అది కచ్చితంగా అహ్మదాబాదే. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, వాళ్లు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో అందరికీ తెలుసు... 

58
India vs Pakistan

అహ్మదాబాద్‌కి వెళ్లి మ్యాచులు ఆడతాం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇదే చెబుతుంది. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారో తెలిసి కూడా వెళ్తారా? అని ప్రశ్నిస్తుంది. దానికి మా దగ్గర సమాధానం లేదు...

68

నేను జై షాతో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. అతను కూడా చాలా స్నేహపూర్వకంగా మాట్లాడాడు. అయితే అసలు సమస్య ఏంటంటే పాకిస్తాన్‌లో ఆడడానికి ఇండియాకి వచ్చిన సమస్య ఏంటో మాత్రం అతను చెప్పడం లేదు..

78

ఎందుకు రారు? మీ సమస్య ఏంటి అని అడిగితే... నవ్వుతూ, దాని గురించి మాట్లాడకుండా వేరే పరిష్కారం వెతకమని చెబుతున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ..
 

88

పాకిస్తాన్‌లో కాకపోతే ఇంగ్లాండ్‌లో లేదా యూఏఈలో ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఆసియా కప్‌పై క్లారిటీ వస్తే, వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల కానుంది. 

click me!

Recommended Stories