నాకు క్రికెట్ తప్ప ఇంకేమీ తెలీదు! అలాంటి ట్రోల్స్ చూసినప్పుడు ఏడ్చేస్తుంటా... కెఎల్ రాహుల్ కామెంట్...

Published : May 17, 2023, 06:32 PM IST

టీమిండియాలో ట్రోల్ మెటీరియల్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కెఎల్ రాహుల్. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిరూపించుకోలేకపోయిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడి జట్టుకి దూరమయ్యాడు...  

PREV
18
నాకు క్రికెట్ తప్ప ఇంకేమీ తెలీదు! అలాంటి ట్రోల్స్ చూసినప్పుడు ఏడ్చేస్తుంటా... కెఎల్ రాహుల్ కామెంట్...

కెఎల్ రాహుల్, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు కూడా అతనిపై తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి. కెఎల్ రాహుల్ త్వరగా అవుటైన మ్యాచుల్లో లక్నో సూపర్ జెయింట్స్ గెలుస్తూ వచ్చింది. రాహుల్ బాగా ఆడిన చాలా మ్యాచుల్లో ఓడిపోయింది..
 

28

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో ఐపీఎల్ 2023 సీజన్‌ మొత్తానికి దూరమైన కెఎల్ రాహుల్, ప్రస్తుతం నడవడానికి కూడా తెగ ఇబ్బంది పడుతున్నాడు...

38

ఊత కర్రల సాయంతో నడుస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కెఎల్ రాహుల్, ‘ది రణ్‌వీర్ షో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు..

48
KL Rahul

‘ఈ ట్రోల్స్ నిజంగా నాపైన చాలా ప్రభావం చూపిస్తాయి. నేను మాత్రమే కాదు, టీమ్‌లో ఉన్న చాలామంది ఈ ట్రోల్స్‌ని పర్సనల్‌గా తీసుకుంటారు. అథ్లెట్స్ కోరుకునేది ఒక్కటే మీ సపోర్ట్. అలాంటి వాళ్లే తిడుతూ, ట్రోల్ చేస్తుంటే అస్సలు తట్టుకోలేం...

58

ఏ ఒక్క ప్లేయర్ కూడా త్వరగా అవుట్ అవ్వాలని అనుకోడు. బాగా ఆడాలనే ఉద్దేశంతోనే క్రీజులో దిగుతాడు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇదే మా జీవితం. మేం చేయగలిగింది ఇంతే. పొగిడితే ఉప్పొంగిపోవడం, తిడితే బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవడం..
 

68

నాకు క్రికెట్ తప్ప మరో విషయం తెలీదు. అందుకే ఎవరు ఎన్ని తిట్టినా, ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా క్రికెట్‌ని మాత్రం వదలను. చాలా మంది నేను గేమ్‌‌ని సీరియస్‌గా తీసుకోనని, తగినంత కష్టపడడం లేదని అనుకుంటారు...
 

78
KL Rahul

అయితే క్రికెట్‌లో కానీ ఏ ఆటలో కానీ కష్టపడినంత మాత్రాన రిజల్ట్ మనవైపు వస్తుందని లేదు. కొన్నిసార్లు లక్ కూడా కలిసి రావాలి. నేనేం చేయగలనో నాకు తెలుసు. కానీ అన్ని రోజులు నావే కావాలనుకుంటే కుదరదు..’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్..

88
KL Rahul-Dravid

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి రెండు మ్యాచులు ఆడి ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాహుల్‌, టెస్టు టీమ్‌లో ఆడేందుకు పనికి రాడంటూ మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు చేయడం సంచలనం క్రియేట్ చేసింది. దీంతో మూడో టెస్టులో రాహుల్ టీమ్‌లో చోటు కోల్పోయాడు. 

click me!

Recommended Stories