ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపైకి వెళ్లింది. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది..
సెప్టెంబర్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ ఆడే ఇండియా- పాకిస్తాన్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో తలబడబోతున్నాయి. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదిక ఇవ్వబోతున్నట్టు కూడా వార్తలు వచ్చేశాయి.. త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది...
26
India vs Pakistan
2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ కావడంతో ఈసారి టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి... రోహిత్ సేన, ఈసారి ప్రపంచ ఛాంపియన్ అవుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు..
36
India vs Pakistan
అహ్మదాబాద్, లక్నో, ముంబై, రాజ్‌కోట్, బెంగళూరు, ఢిల్లీ, ఇండోర్, మొహాలీ, గౌహతి, ధర్మశాల, కోల్‌కత్తా వంటి ముఖ్య నగరాల్లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులు జరగబోతున్నాయి..
46
‘వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఉపఖండంలో జరుగుతోంది. ఇక్కడ ఇండియా, పాకిస్తాన్ టీమ్‌లను ఓడించడం ఎవ్వరి తరం కాదు. నాకు తెలిసి ఈసారి ఇండియా- పాకిస్తాన్ ఫైనల్ చేరతాయి. వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలవడానికి పాకిస్తాన్‌కి ఇది సువర్ణావకాశం..
56
అయితే ఎన్ని లెక్కలు వేసుకున్నా, ఎన్ని అంచనాలు వేసినా చివరికి అన్ని మ్యాచులు బాగా ఆడిన జట్టే, వరల్డ్ కప్ గెలుస్తుంది. వరల్డ్ కప్ కోసం అందరూ నాలుగేళ్లు ఎదురుచూస్తారు. వరల్డ్ కప్ గెలవడానికి అన్ని జట్లు ఎంతో కష్టపడతాయి..
66
నాలుగేళ్ల కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే వన్డే వరల్డ్ కప్‌లో సరిగ్గా ఆడాలి. బాబర్ ఆజమ్ టీమ్ ఆడుతున్న విధానం చూశాక ఈసారి మనల్ని ఫైనల్ వెళ్లకుండా ఆపే టీమ్ కనిపించడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్..