మొదటి రోజే ఓడిపోతామని అర్థమైపోయింది! ఇలా ఆడితే ఎప్పటికీ గెలవరు - బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ భిన్నీ...

Published : Jun 15, 2023, 01:48 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు, ఆస్ట్రేలియా చేతుల్లో 209 పరుగుల తేడాతో ఓడింది...  

PREV
17
మొదటి రోజే ఓడిపోతామని అర్థమైపోయింది! ఇలా ఆడితే ఎప్పటికీ గెలవరు -  బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ భిన్నీ...

పదేళ్ల తర్వాత టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న భారత అభిమానులకు ఈ ఓటమితో ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ మారినా, హెడ్ కోచ్ మారినా టీమ్ ఆటతీరు మాత్రం మారడం లేదు..

27

చాలా ఏళ్ల తర్వాత టీమిండియాకి టాస్‌తో పాటు పిచ్, వాతావరణం అన్నీ కలిసి వచ్చినా ఐసీసీ ఫైనల్‌లో మనోళ్ల పేలవ ప్రదర్శన మాత్రం కొనసాగుతూ వచ్చింది. 444 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, ఆఖరి రోజు ఒకే సెషన్‌లో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

37
Roger Binny-Rohit Sharma

తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ భిన్నీ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఓటమిపై స్పందించాడు. టీమిండియా ఓటమికి స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ భారీ భాగస్వామ్యమే కారణమని అన్నాడు రోజర్ భిన్నీ...

47

‘మొదటి రోజే టీమిండియా ఓడిపోతుందని అర్థమైంది. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని డామినేట్ చేశారు. ఆ భాగస్వామ్యాన్ని త్వరగా విడదీసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేది..

57

మ్యాచ్‌లు గెలవాలంటే భాగస్వామ్యాలు నిర్మించాలి, ప్రత్యర్థి జట్టు భారీ భాగస్వామ్యాలు నిర్మించకుండా జాగ్రత్త పడాలి. టీమిండియాలో ఈ రెండూ నాకు కనిపించలేదు... అందుకే మొదటి రోజే మ్యాచ్ రిజల్ట్ నాకు అర్థమైపోయింది..

67

అయితే ఈ ఒక్క ఓటమితో టీమ్ పర్ఫామెన్స్‌ని తక్కువ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టీమిండియా చాలా రోజులుగా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతోంది.

77

అదీకాక స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాం... అది చాలా ముఖ్యం.. అందులో మనవాళ్లు టైటిల్ గెలుస్తారనే నమ్మకం ఉంది..  ’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ భిన్నీ.. 

click me!

Recommended Stories