మళ్లీ విరాట్ కోహ్లీకే వన్డే కెప్టెన్సీ పగ్గాలు... రోహిత్ శర్మ గాయంపై అనుమానాలతో...

First Published Dec 21, 2021, 9:45 AM IST

సౌతాఫ్రికా టూర్‌‌కి ముందు భారత జట్టులో జరుగుతున్న పరిణామాలు, సగటు క్రికెట్ అభిమానిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ, మళ్లీ అతనికే పగ్గాలు అప్పగించాలని చూస్తోందట...

టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్‌‌కి సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేశారు సెలక్టర్లు...

విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని, టీ20 కెప్టెన్సీ నుంచి అతను తప్పుకోవడంతో వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్టు బీసీసీఐ బాస్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...

టెస్టు ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌ను అజింకా రహానేను తప్పించి, రోహిత్ శర్మకు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ...

ఈ పరిణామాల తర్వాత విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అయితే రోహిత్ గాయంపై క్లారిటీ రాకపోవడంతో వన్డే సిరీస్ సమయానికి అతను కోలుకుంటాడా? లేదా? అనే విషయంపై అనుమానాలు రేగుతున్నాయి.

ఒకవేళ వన్డే సిరీస్ సమయానికి రోహిత్ శర్మ కోలుకోకపోతే, మళ్లీ విరాట్ కోహ్లీకే వన్డే పగ్గాలు అప్పగించాలని భావిస్తోందట బీసీసీఐ...

అయితే చెప్పాపెట్టకుండా వన్డే కెప్టీన్సీతో బాగా హార్ట్ అయిన విరాట్ కోహ్లీని బుజ్జగించే పనిలో ఉన్నారట భారత క్రికెట్ బోర్డు పెద్దలు...

ఒకవేళ విరాట్ కోహ్లీ మళ్లీ వన్డే కెప్టెన్‌గా వ్యవహరించడానికి ఒప్పుకోకపోతే, కెఎల్ రాహుల్‌కి ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తోందట...

అయితే ఇదంతా రోహిత్ శర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతేనే. ఒకవేళ రోహిత్ గాయం నుంచి పూర్తిగా రికవరీ అయితే వన్డే కెప్టెన్‌గా కెరీర్ ఆరంభించనున్నాడు హిట్ మ్యాన్...

ఒకవేళ రోహిత్ శర్మ వన్డే సిరీస్ సమయానికి కోలుకోకపోతే మాత్రం భారత క్రికెట్ జట్టుకి కొత్త కష్టాలు తప్పకపోవచ్చు. విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడానికి ఇష్టపడకపోతే, కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంత వరకూ సక్సెస్ అవుతాడనేది అనుమానమే..

click me!