ధోనీలాంటోడిని చూడలేదు! డకౌట్ అయినా, వరల్డ్ కప్ గెలిచినా... మాజీ కోచ్ రవిశాస్త్రి...

First Published Jan 27, 2022, 1:49 PM IST

టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత వరుస ఇంటర్వ్యూలతో యమ బిజీగా గడుపుతున్నాడు రవిశాస్త్రి. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు రవిశాస్త్రి...

‘విరాట్ కోహ్లీ క్రీజులో ఓ పులిలా కదులుతాడు. ఫీల్డ్‌లో అడుగుపెట్టిన తర్వాత అతను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయాలని అనుకోడు...

క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత మిగిలిన విషయాల గురించి ఏ మాత్రం పట్టించుకోడు. కానీ బయట మాత్రం అతను చాలా కూల్ అండ్ ఛిల్ యాటిట్యూడ్‌తో ఉంటాడు...

రోహిత్ శర్మ మాత్రం కాస్త వెనక్కి తిరిగి చూసుకునే వ్యక్తి. అతని మూడ్ చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది, అయితే ఎమోషన్స్ చూపించడు.

రోహిత్ యాటిట్యూడ్ కాస్త ధోనీకి దగ్గరగా ఉంటుంది... ఎమ్మెస్ ధోనీ మాత్రం వాస్తవికానికి దూరంగా ఉంటాడు. డకౌట్ అయినా, సెంచరీ చేసినా... ఆఖరికి వరల్డ్ కప్ గెలిచినా పెద్దగా పట్టించుకోనట్టుగా ఉంటాడు...

నా కెరీర్‌లో నేను ఎందరో క్రికెటర్లను చూశాను, కానీ ధోనీలాంటోడిని మాత్రం ఇప్పటిదాకా చూడలేదు. సచిన్ టెండూల్కర్ చాలా మృదు స్వభావి, అయినా అతనికి కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది...

ఎమ్మెస్ ధోనీకి మాత్రం అలా నేనెప్పుడూ చూడలేదు. నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా నా దగ్గర ఎమ్మెస్ ధోనీ ఫోన్ నెంబర్ లేదు...

నేనెప్పుడూ అతని నెంబర్ అడగలేదు, అతను కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఎమ్మెస్ ధోనీ ఎప్పుడూ ఫోన్ క్యారీ చేయడని నాకు తెలుసు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...

టీమిండియాలో ఎమ్మెస్ ధోనీ టెంపర్‌‌ కోల్పోవడం అప్పుడప్పుడూ చూసినా, ఐపీఎల్‌లో మాత్రం అతని కోపాన్ని చాలా సార్లు చూశారు అభిమానులు...

ఐపీఎల్‌లో ఎమ్మెస్ ధోనీ కోపాన్ని చాలాసార్లు చూశారు అభిమానులు. ఐపీఎల్ 2019 సీజన్‌లో అంపైర్ వైడ్ ఇచ్చి, ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం... డగౌట్‌ నుంచి క్రీజులోకి వచ్చి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు ఎమ్మెస్...

టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఆడిన ఆఖరి టోర్నీ టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో భారత జట్టు మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ వ్యవహరించిన విషయం తెలిసిందే.

click me!