ఐపీఎల్‌లో కెఎల్ రాహుల్‌కి బంపరాఫర్, ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డునే... రషీద్ ఖాన్, హార్ధిక్ పాండ్యాలకు...

First Published Jan 22, 2022, 10:19 AM IST

కెఎల్ రాహుల్ ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా కెప్టెన్సీ స్కిల్స్ శూన్యం... ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టునూ ప్లేఆఫ్స్‌కి కూడా చేర్చలేకపోయిన కెఎల్ రాహుల్, సౌతాఫ్రికాలో టీమిండియాకి మూడు మ్యాచుల్లో ఒక్క విజయం కూడా అందించలేకపోయాడు...

గత 60 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో మొదటి మూడు మ్యాచుల్లో మూడుకి మూడు పరాజయాలు అందుకున్న అతి చెత్త రికార్డు సొంతం చేసుకున్న సారథి కెఎల్ రాహుల్...

అయితే ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంఛైజీ లక్నో టీమ్ మాత్రం కెఎల్ రాహుల్‌పైన భారీ ఆశలు, అంచనాలే పెట్టుకుంది. కెఎల్ రాహుల్‌కి రూ.17 కోట్లు చెల్లించి మరీ సొంతం చేసుకుంది లక్నో...

ఐపీఎల్‌లో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్‌గా ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు కెఎల్ రాహుల్. 2016 నుంచి 2020 వరకూ ఏటా రూ.17 కోట్లు అందుకున్నాడు విరాట్ కోహ్లీ...

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది లక్నో ఫ్రాంఛైజీ...

అలాగే పంజాబ్ కింగ్స్ జట్టు మాజీ స్పిన్నర్, అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవిభిష్ణోయ్‌ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో...

లక్నో కెప్టెన్ సెలక్షనే చెత్తగా ఏడ్చిందనుకుంటే, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ అంతకుమించి దరిద్రంగా ప్లేయర్లను ఎంచుకుందని అంటున్నారు అభిమానులు...

ముంబై ఇండియన్స్ మాజీ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాని రూ.15 చెల్లించి, కెప్టెన్‌గా ఎంచుకుంది అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ. 

గత రెండేళ్లుగా సరైన ఫామ్‌లో లేని పాం్డయాకి ఈ మొత్తం చెల్లించడం, కెప్టెన్‌గా ఎంచుకోవడం క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని కూడా అవాక్కయ్యేలా చేసింది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, ఆఫ్ఘాన్ యంగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి కూడా రూ.15 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదర్చుకుంది అహ్మదాబాద్...

టీ20లను కూడా టెస్టుల్లా ఆడతాడని ట్రోల్స్ ఎదుర్కొనే యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌ను ఏకంగా రూ.8 కోట్లు చెల్లించి మరీ తీసుకోవడం మరీ ఆశ్చర్యకరమైన విషయం...

డ్రాఫ్ట్ ప్లేయర్ల కోసం లక్నో జట్టు రూ.30.2 కోట్లు ఖర్చు చేస్తే, అహ్మదాబాద్ జట్టు ముగ్గురు ప్లేయర్ల కోసం రూ.38 కోట్లు ఖర్చు పెట్టేసింది...

మెగా వేలంలో ప్రతీ జట్టు పర్సులో రూ.90 కోట్లు ఉంటాయి. ఇప్పుడు లక్కో జట్టు రూ.30.2 కోట్లు ఖర్చు చేయడంతో ఆ ఫ్రాంఛైజీ పర్సులో రూ.59.8 కోట్లు, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ పర్సులో రూ.52 కోట్లు ఉన్నాయి. 

click me!