శిఖర్ ధావన్‌కి కాదు, అశ్విన్‌కి కెప్టెన్సీ ఇవ్వండి! ఆసియా గేమ్స్‌ 2023పై దినేశ్ కార్తీక్ కామెంట్...

Published : Jul 02, 2023, 01:56 PM IST

10 రోజుల్లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న భారత జట్టు, సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో బిజీబిజీగా గడపనుంది. అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్‌ ప్రారంభం కాబోతుంటే ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది భారత జట్టు...  

PREV
16
శిఖర్ ధావన్‌కి కాదు, అశ్విన్‌కి కెప్టెన్సీ ఇవ్వండి!  ఆసియా గేమ్స్‌ 2023పై దినేశ్ కార్తీక్ కామెంట్...
Shikhar Dhawan

ఆసియా కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో వన్డే సిరీస్‌లు జరగాల్సి ఉంది. ఇదే టైమ్‌లో ఏషియన్ గేమ్స్ 2023 ప్రారంభం కాబోతున్నాయి. ఈ పోటీల్లో క్రికెట్ టీమ్‌ కూడా పాల్గొనబోతోంది..

26
Image credit: PTI

వన్డే వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకుని, తొలుత ఏషియన్ గేమ్స్‌ 2023 పోటీలకు భారత క్రికెట్ టీమ్స్‌ని పంపేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. అయితే పోటీల్లో స్వర్ణ పతకం తెచ్చేందుకు ఆస్కారం ఉన్న క్రికెట్‌లో పోటీచేయకపోవడం కరెక్ట్ కాదని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో భారత బీ టీమ్‌ని పంపాలని భావిస్తోంది..
 

36
Image credit: Getty

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ వార్మప్ మ్యాచులు ఆడే సమయంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత బీ జట్టు, ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో పాల్గొంటుంది. భారత బీ జట్టుకి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడని టాక్ వినబడుతోంది..

46

‘ఏషియన్ గేమ్స్‌ కోసం భారత బీ జట్టును పంపితే, రవిచంద్రన్ అశ్విన్‌కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అశ్విన్‌కి ఎలాగో చోటు దక్కదు. ఎన్నో ఏళ్లుగా టీమ్‌లో సీనియర్‌గా ఉన్న అశ్విన్‌కి కెప్టెన్సీ దక్కితే, అది అతని సేవలకు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది..
 

56

ఆల్‌రౌండర్‌గా అశ్విన్ ఎన్నో మ్యాచులు గెలిపించాడు. టీమిండియా సారథిగా అయ్యేందుకు అశ్విన్‌కి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఏషియన్ గేమ్స్‌‌కి ప్రకటించే జట్టులో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నా..

66
Image credit: PTI

అశ్విన్, టీమిండియా ప్లేయర్‌గా ఎన్నో సాధించాడు. అయితే విజయాల్లో కెప్టెన్సీ అనే మకుటం చేరితే చాలా బాగుంటుంది. అందుకు అతను అన్ని విధాల అర్హుడు కూడా..’ అంటూ కామెంట్ చేశాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..

click me!

Recommended Stories