ఇండియాలో పుట్టి ఉంటే 1000 వికెట్లు తీసేవాడిని! కావాలనే కుట్ర చేశారు... - పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్

Published : Jul 02, 2023, 12:43 PM IST

పాక్ క్రికెట్‌ టీమ్‌లో సంచలనంలా ప్లేయర్లు రావడం, కొంతకాలం మెరుపులు మెరిపించి మాయమైపోవడం చాలా కామన్. వసీం అక్రమ్ తర్వాత 100 టెస్టులు ఆడిన పాక్ బౌలర్ ఒక్కడూ లేడు. ఆరంభంలో స్టార్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పాక్ మాజీ బౌలర్ సయిద్ అజ్మల్, 212 అంతర్జాతీయ మ్యాచుల్లో 447 వికెట్లు తీసి మాయమైపోయాడు..

PREV
16
ఇండియాలో పుట్టి ఉంటే 1000 వికెట్లు తీసేవాడిని! కావాలనే కుట్ర చేశారు... - పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 వన్డే, టీ20 బౌలర్‌గా నిలిచిన సయిద్ అజ్మల్, తన బౌలింగ్ వేరియేషన్స్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి భారత టాప్ క్లాస్ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టాడు..

26

2014లో సయిద్ అజ్మల్‌ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని నిరూపితం కావడంతో అతనిపై బ్యాన్ విధించింది ఐసీసీ. అతని బౌలింగ్ యాక్షన్, ఐసీసీ రూల్ ప్రకారం నిర్దేశించిన 15 డిగ్రీల కంటే ఎక్కువగా తిరుగుతున్నాయని నిర్దారించింది ఐసీసీ. ఈ బ్యాన్ నుంచి బయటపడినా అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం తిరిగి చోటు దక్కించుకోలేకపోయాడు అజ్మల్..

36

‘ఇండియాలో పుట్టి ఉంటే, ఈపాటికి అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 వికెట్లు తీసుకుని ఉండేవాడిని. ప్రతీ ఏడాది 100 వికెట్లు తీసుకోగల సత్తా నాలో ఉంది. నేను ఆడిన నాలుగైదు ఏళ్లలో ప్రతీ ఏడాది 100 వికెట్లు తీసుకున్నా...

46

2009లోనే నాపై కుట్ర జరిగింది. కానీ దాన్ని అధిగమించి నేను అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాగలిగాను. అత్యంత వేగంగా అతి తక్కువ కాలంలో 448 వికెట్లు తీసిన తర్వాత నన్ను ఆపేశారు. నన్ను ఆపకపోతే చాలామంది రికార్డులు కొల్లగొట్టేస్తానని వాళ్లు భయపడ్డారు..

56

నేను వరల్డ్ నెం.1 బౌలర్‌గా ఉన్నప్పుడు నాపైన బ్యాన్ పడింది. అప్పటిదాకా నా బౌలింగ్ యాక్షన్‌పై ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఒక్కసారిగా నెం.1 బౌలర్‌గా మారినప్పుడే ఎందుకు బ్యాన్ వేశారు? ఇది కచ్ఛితంగా నన్ను అణిచివేసేందుకు జరిగిన రాజకీయ కుట్రే..’ అంటూ కామెంట్ చేశాడు సయిద్ అజ్మల్..
 

66

బౌలింగ్ యాక్షన్ మార్చుకుంటే సయిద్ అజ్మల్‌ని తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అనుమతిస్తామని ఐసీసీ తెలిపింది. అయితే ఐసీసీ చెప్పిన మార్పులకు అనుగుణంగా తన బౌలింగ్‌ని మార్చుకోవడంలో అజ్మల్ విఫలమయ్యాడు. 2015లో ఆఖరి మ్యాచ్ ఆడి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు..

click me!

Recommended Stories