అతన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్న రోహిత్ శర్మ... ఇలా అయితే టీ20 వరల్డ్ కప్‌లో చోటు కష్టమే...

Published : Sep 06, 2022, 04:56 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో నెగ్గిన భారత జట్టు, సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్‌ చేతుల్లో పోరాడి ఓడింది. ఆఖరి ఓవర్ వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన బౌలర్లు ఫెయిల్ అవ్వడం... అభిమానులను కలవరబెడుతోంది...

PREV
19
అతన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్న రోహిత్ శర్మ...  ఇలా అయితే టీ20 వరల్డ్ కప్‌లో చోటు కష్టమే...

18వ ఓవర్ ముగిసే వరకూ మ్యాచ్‌లో టీమిండియా ఆధిక్యమే సాగింది. 12 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేయాల్సి ఉన్నా భారత్‌ చేతుల్లో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ వంటి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్లు ఉండడంతో పాక్ గెలవడం అంత తేలికేం కాదనుకున్నారు...

29

భువీ మొదటి మూడు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదీకాకుండా కీలక మహ్మద్ నవాజ్ వికెట్ తీశాడు. అయితే స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. తన 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించి ఒకే ఒక్క వికెట్ తీశాడు చాహాల్...

39
Image credit: PTI

ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన యజ్వేంద్ర చాహాల్, 3 ఫోర్లతో 16 పరుగులు సమర్పించాడు. సూపర్ 4 రౌండ్ మ్యాచ్‌లోనే కాదు, అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ యజ్వేంద్ర చాహాల్ ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు...

49
Image credit: PTI

ఆఖరికి హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లోనూ యజ్వేంద్ర చాహాల్‌కి వికెట్ దక్కలేదు. 4 ఓవర్లలో 18 పరుగుల మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ వేసినా పసికూన టీమ్‌పై భారత జట్టు ప్రధాన స్పిన్నర్‌కి వికెట్ దక్కకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది.

59
Chahal

యజ్వేంద్ర చాహాల్ కంటే కుర్రాడు రవిభిష్ణోయ్, పాక్‌పై ఆకట్టుకునే బౌలింగ్ వేశాడు. అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ మిస్ చేయడం వల్లే యజ్వేంద్ర చాహాల్, హార్ధిక్ పాండ్యాలు ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నారు. లేకపోతే టీమిండియాకి ఓటమికి ఈ ఇద్దరినే కారణంగా చూపించేవాళ్లు...

69
Yuzvendra Chahal

యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కలేదు. అతని స్థానంలో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్ వంటి యంగ్ స్పిన్నర్లను ఆడించింది టీమిండియా. చాహాల్ ఉండి ఉంటే టీమిండియా గెలిచేదని కామెంట్లు చేశారు చాలా మంది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

79

అయితే ఇప్పుడు ఆసియా కప్ 2022 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్ పర్పామెన్స్ చూస్తుంటే... అప్పుడు అతను ఉండి ఉన్నా, పెద్దగా తేడా ఉండకపోయేదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో యజ్వేంద్ర చాహాల్... భారత జట్టుకి ప్రధాన స్పిన్నర్‌గా ఉండేవాడు...

89
Image credit: PTI

పవర్ ప్లే ముగిసిన తర్వాత బౌలింగ్‌‌కి వికెట్లు తీయడం యజ్వేంద్ర చాహాల్ స్పెషాలిటీ. అయితే రోహిత్ శర్మ మాత్రం యజ్వేంద్ర చాహాల్‌ని వికెట్ టేకర్‌గా కాకుండా పరుగులు నియంత్రించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడు. ఇదే చాహాల్ పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపుతోంది...
 

99
Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో ఫెయిల్ అయితే అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్‌ పేరు కనిపించకపోయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆసియా కప్ 2022 పర్పామెన్స్ ఆధారంగానే పొట్టి ప్రపంచకప్‌కి జట్టును ఎంపిక చేయాలని భావిస్తోంది బీసీసీఐ...

Read more Photos on
click me!

Recommended Stories