ఆసియా కప్ 2022 టోర్నీ మధ్యలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడడంతో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని ప్లేస్‌లో దీపక్ హుడాకి చోటు కల్పించింది టీమిండియా. అయితే అతనితో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం విమర్శలకు తావిచ్చింది...
పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, సూపర్ 4 రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించాడు. స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కూడా 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించాడు...
27
వీళిద్దరూ ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నా మరో బౌలింగ్ ఆప్షన్ లేనట్టుగా ఐదుగురు బౌలర్ల ఫార్మాలానే ఫాలో అయ్యాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దీపక్ హుడా రూపంలో జట్టులో ఆల్‌రౌండర్ ఉన్నా అతనితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయించలేదు...
37
జడేజా గాయంతో దూరమైనప్పుడు జట్టులో ఉన్న హిట్టర్ దినేశ్ కార్తీక్‌కి రెస్ట్ ఇవ్వడం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లు బ్యాటింగ్‌లో ఫెయిల్ అవ్వడంతో భారత జట్టు అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది.
47
Image credit: Getty
‘నా ఉద్దేశంలో టీమిండియాకి కాంబినేషన్ వర్కవుట్ అవ్వడం లేదు. అక్షర్ పటేల్‌కి తుది జట్టులో చోటు ఇవ్వాలి. హార్ధిక్ పాండ్యా బాగానే బౌలింగ్ వేస్తున్నాడు. అయితే అతన్ని ఐదో బౌలింగ్ ఆప్షన్‌గా పరిగణించడం కరెక్ట్ కాదు...
57
పాండ్యాతో ప్రతీసారి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించడం కూడా మంచిది కాదు. ఆవేశ్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాబట్టి హార్ధిక్‌ని ఆరో బౌలర్‌గా వాడాలంటే అక్షర్ పటేల్ తుదిజట్టులో ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారా...
67
టీమిండియా టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా కౌంటీల్లో పరుగుల వరద పారించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 8 మ్యాచులు ఆడి 5 సెంచరీలు, అందులో 3 డబుల్ సెంచరీలతో 1094 పరుగులు చేశాడు.
77
Cheteshwar Pujara
రాయల్ లండన్ వన్డే కప్ 2022లో 9 మ్యాచులు ఆడిన ఛతేశ్వర్ పూజారా 115.85 స్ట్రైయిక్ రేటుతో 94.00 సగటుతో 658 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి...