సచిన్, రోహిత్ కాదు.. అర్జున్ టెండూల్కర్ కు ఇష్టమైన క్రికెటర్ అతడే..

Published : Feb 01, 2022, 02:07 PM IST

Arjun Tendulkar Favourite Cricketer: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్.. తన ఫేవరేట్ క్రికెటర్ పేరు చెప్పాడు. అయితే  ఇందులో అతడి తండ్రి పేరు లేకపోవడం గమనార్హం.   

PREV
17
సచిన్, రోహిత్ కాదు..  అర్జున్ టెండూల్కర్ కు ఇష్టమైన క్రికెటర్ అతడే..

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒక్కగానొక్క కుమారుడు  అర్జున్ టెండూల్కర్ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.  ప్రస్తుతం దేశవాళీలో ఆడుతున్న  అర్జున్.. గతేడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.

27

ఈ యంగ్ ఆల్  రౌండర్ ఇటీవలే  సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించాడు.  తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పాలని ప్రశ్నించగా..  అర్జున్ సమాధానం చూసి అంతా నివ్వెరపోయారు. 
 

37

ఇన్స్ట్రాగ్రామ్ లో ‘ఆస్క్ మి క్వశ్చన్స్’  అంటూ తన ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన అర్జున్ టెండూల్కర్ కు.. ముంబై ఇండియన్స్ లో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. 

47

అయితే అర్జున్.. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తన తండ్రి సచిన్ టెండూల్కర్ పేరో లేదంటే  ఆసీస్ మాజీ దిగ్గజం  రికీ పాంటింగ్ పేరు, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ పేరైనా చెప్తారని అంతా భావించారు.
 

57

కానీ ఈ జూనియర్ సచిన్ మాత్రం.. ‘జస్ప్రీత్’ అని జవాబునివ్వడం గమనార్హం. ముంబై ఇండియన్స్ జట్టులో ప్రధాన బౌలర్ గా ఉన్న బుమ్రా తనకు ఇష్టమైన ఆటగాడని  అర్జున్ రిప్లై ఇచ్చాడు. 

67

ఇక టీమిండియా పేస్ గుర్రం బుమ్రా కెరీర్ ప్రారంభమైందే  ముంబై ఇండియన్స్ జట్టుతో.. ఆ జట్టు తరఫున 106 మ్యాచులాడిన బుమ్రా.. 130 వికెట్లు పడగొట్టాడు. ముంబై  ప్రధాన బౌలర్ లసిత్ మలింగ..  వైదొలిగిన అనంతరం  ట్రెంట్ బౌల్ట్ తో కలిసి బుమ్రా ముంబై బౌలింగ్ బాధ్యతలను మోస్తున్నాడు. 

77

గతేడాది ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో ముంబై జట్టు బుమ్రాను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. బుమ్రా తో పాటు కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ లను కూడా రిటైన్ చేసుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories