రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వేస్ట్... అతనికి కెప్టెన్సీ అప్పగించండి... గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్...

First Published Oct 15, 2021, 6:34 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. పంత్ కెప్టెన్సీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, టైటిల్ ఆశలను మాత్రం నెరవేర్చుకోలేకపోయింది. అంతకుముందు గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో మొట్టమొదటి సారి ఫైనల్‌కి చేరింది ఢిల్లీ క్యాపిటల్స్...

12 సీజన్లలో కాని దానిని చేసి చూపించినా, రిషబ్ పంత్ ఎంట్రీతో ఆ తర్వాతి సీజన్‌లోనే కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది శ్రేయాస్ అయ్యర్. అయితే అయ్యర్ కెప్టెన్సీలో సాధ్యంకాని విజయాలను రిషబ్ పంత్ తేలిగ్గా చేసి చూపించాడు. 

గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ చేతుల్లో నాలుగుకి నాలుగు మ్యాచుల్లో ఓడింది ఢిల్లీ... అయితే ఈసారి మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్, లీగ్ స్టేజ్‌లో సీఎస్‌కేని రెండుసార్లు, ముంబై ఇండియన్స్‌ను రెండుసార్లు ఓడించింది...

అయితే వచ్చే సీజన్‌లో ఈ ఇద్దరికీ కాకుండా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి కెప్టెన్సీ ఇవ్వాలని కొంచెం వింతైన కామెంట్ చేశాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్... 

‘రవిచంద్రన్ అశ్విన్‌కి నేను చాలా పెద్ద అభిమానిని. ప్రపంచంలో బెస్ట్ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు. ఢిల్లీ జట్టు లైనప్‌ను చూస్తే కొంచెం వింతగా అనిపించొచ్చు. కానీ నా ఉద్దేశంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి వచ్చే ఏడాది అశ్విన్‌ని కెప్టెన్‌గా నియమిస్తే బాగుంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టుకి ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్, ఐపీఎల్ 2021 సీజన్‌లో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. కేకేఆర్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో ఫీల్డింగ్‌లో ఓ ఈజీ క్యాచ్‌ను డ్రాప్ చేసి ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యాడు....

అయితే రవిచంద్రన్ అశ్విన్‌కి కెప్టెన్సీ అప్పగిస్తే, అతని నుంచి నూటికి 200 శాతం ఫలితాలను రాబట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు గౌతమ్ గంభీర్. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ జట్టుకి రెండేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించాడు రవి అశ్విన్...

అయితే వచ్చే ఏడాది మెగా వేలం ఉండడంతో అన్ని జట్లూ ప్లేయర్లను వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది. మహా అయితే ముగ్గురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది...

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌ రిషబ్ పంత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, పృథ్వీషా, ఆవేశ్ ఖాన్‌, అక్షర్ పటేల్‌ వంటి ప్లేయర్లలో ఏ ఇద్దరిని ఉంచుకోవాలో నిర్ణయించుకోవడానికే తలలు పట్టుకునే అవకాశం ఉంది...

click me!