IPL2021 CSK vs KKR: ఆరెంజ్ క్యాప్ తో పాటు ఆ రికార్డుకు చేరువలో రుతురాజ్.. నేటి మ్యాచ్ లో వాటిని సాధిస్తాడా..?

First Published Oct 15, 2021, 5:30 PM IST

Ruturaj Gaikwad: ఈ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ ఒకడు. చెన్నై బ్యాటింగ్  భారాన్ని మరో ఓపెనర్ డూప్లెసిస్ తో కలిసి మోస్తున్న ఈ మరాఠీ కుర్రాడు.. నేటి మ్యాచ్ లో చెలరేగితే కోల్కతాకు చుక్కలే.

డాడీస్ ఆర్మీ గా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) ఈ ఐపీఎల్ (IPL)లో ఫైనల్స్ కు చేరిందంటే అందులో  ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ Ruturaj Gaikwad) పాత్ర కీలకం. ఈ సీజన్ ఆధ్యంతం అద్భుతంగా రాణిస్తున్న గైక్వాడ్.. మరో రెండు రికార్డులకు అత్యంత చేరువలో ఉన్నాడు. 

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ (Punjab Super kings) కెప్టెన్ కెఎల్ రాహుల్ (KL Rahul) తర్వాత అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో గైక్వాడ్ రెండో స్థానంలో ఉన్నాడు.
 

మరో 23 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్ (Ipl Orange cap) గైక్వాడ్ సొంతమవుతుంది. ఈ సీజన్ లో  ఇప్పటివరకు 15 మ్యాచ్ లాడిన గైక్వాడ్.. 603 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 46.38 గా ఉండగా.. స్ట్రైక్ రేట్ 137.35 గా ఉంది. 
 

ఈ జాబితాలో కెఎల్ రాహుల్ 626 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.  గైక్వాడ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ (587) ఉన్నా.. గత మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోవడంతో అతడికి ఆ అవకాశం లేదు. 
 

ఒకవేళ గైక్వాడ్ ఈ మ్యాచ్ లో 23 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకుంటే ఐపీఎల్ లో ఈ క్యాప్ సాధించిన అత్యంత పిన్న వయస్కుడవుతాడు. 

ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ షాన్ మార్ష్ పేరిట ఉంది. 2008 లో పంజాబ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మార్ష్.. ఆ సీజన్ లో 11 మ్యాచుల్లో 616 పరుగులు చేశాడు. 

అప్పటికీ మార్ష్ వయస్సు 25 సంవత్సరాలు. కానీ ప్రస్తుతం గైక్వాడ్ వయసు 24 ఏండ్లు మాత్రమే. రుతురాజ్ ఫామ్ చూస్తే నేటి మ్యాచ్ లో ఈ రికార్డు బద్దలవడం పెద్ద విషయమే కాదు. 

15 మ్యాచుల్లో 603 పరుగులు చేసిన ఈ చెన్నై బ్యాట్స్మెన్.. 4 అర్థ సెంచరీ లతో పాటు రాజస్థాన్ రాయల్స్ మీద మెరుపు సెంచరీ కూడా బాదిన విషయం విదితమే. 

click me!