IPL2021 Final: రెండు సార్లు టైటిల్ గెలిచినా, కేకేఆర్‌‌కి సాధ్యం కాని రికార్డు... లీగ్‌లో ఒక్కసారి కూడా...

First Published Oct 15, 2021, 5:50 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌‌లో టైటిల్ వేటకి అడుగు దూరంలో నిలిచింది కేకేఆర్... త్రీ టైం టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో, రెండు సార్లు టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఫైనల్‌లో తలబడనుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటిదాకా కేకేఆర్‌కి ఓ ఘనత మాత్రం దక్కకుండా ఉండిపోయింది...

టైటిల్ సాధించినా, సాధించకపోయినా లీగ్ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండడం ఓ గొప్ప ఫీట్‌గా భావిస్తారు క్రికెట్ ఫ్యాన్స్... మిగిలిన జట్లను కొందకి తోస్తూ, టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి చేరడాన్ని గర్వంగా చెప్పుకుంటారు...

అయితే ఐపీఎల్‌లో రెండు సార్లు టైటిల్ గెలిచిన కేకేఆర్, 14 సీజన్లలో ఒక్కసారి కూడా టేబుల్ టాపర్‌గా నిలవలేకపోయింది... అవును, వినడానికి వింతగా అనిపిస్తున్నా, కేకేఆర్‌ను మాత్రం ఈ టేబుల్ టాప్ పొజిషన్‌ను అందని ద్రాక్షగానే మిగిలింది...

ఐదు సార్లు టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఐపీఎల్‌లో అత్యధికంగా నాలుగుసార్లు టేబుల్ టాపర్‌గా నిలిచింది. 2010, 2017, 2019, 2020 సీజన్లలో టేబుల్ టాపర్‌లో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది ముంబై...

గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, మూడు సార్లు టేబుల్ టాప్‌లో నిలిచింది. 2009, 2012తో పాటు ఈ ఏడాది 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్...

చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు టేబుల్ టాపర్‌గా ఉంది. 2013తో పాటు 2015 ఐపీఎల్ సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచి మొదటి క్వాలిఫైయర్ ఆడింది సీఎస్‌కే...  

ఐపీఎల్‌లో మొట్టమొదటి టైటిల్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్, మొదటి సీజన్‌లోనే టేబుల్ టాపర్‌గా నిలిచింది.. 2008లో టాప్‌లో నిలిచిన రాజస్థాన్, ఆ తర్వాత ఏ సీజన్‌లోనూ సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. 

ఈ సీజన్‌లో టాప్ 3లో ఉండి, ప్లేఆఫ్స్‌కి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2011 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా ఉంది. ఫైనల్ చేరిన 2016 సీజన్‌లో మాత్రం మెరుగైన రన్‌రేట్ కారణంగా మూడు జట్లకి సమాన పాయింట్లు ఉన్నా రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది..

పంజాబ్ కింగ్స్ జట్లు 2014 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో అద్భుత విజయాలు అందుకున్న పంజాబ్, ఫైనల్‌లో కేకేఆర్ చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే... 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఆడిన 2018 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆ సీజన్‌లో సీఎస‌కే చేతుల్లో ఫైనల్ ఓడిన సన్‌రైజర్స్, రన్నరప్‌గా నిలిచింది...

వీటితో పాటు రెండు సీజన్లు మాత్రమే ఆడిన గుజరాత్ లయర్స్ కూడా 2016 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. సురేష్ రైనా కెప్టెన్సీలో2016లో టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ లయన్స్, ఆ తర్వాతి సీజన్‌ను ఏడో స్థానంతో ముగించడం విశేషం. 

click me!