ఐపీఎల్ 2022 సీజన్‌కి సైరన్ మోగింది. మరో 11 రోజుల్లో మెగా లీగ్ ప్రారంభం కానుంది. 10 ఫ్రాంఛైజీలు పాల్గొనే ఐపీఎల్ 2022 సీజన్‌కి ప్రచార కార్యక్రమాలను జోరుగా చేస్తోంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. తాజాగా విడుదల చేసిన ప్రోమో, అందర్నీ ఆకట్టుకుంటోంది..
కొత్త జట్లతో జాగ్రత్తగా ఉండాలని హార్ధిక్ పాండ్యా, ఓ ప్రోమోలో మిగిలిన జట్లను హెచ్చరిస్తే... అదే ప్రోమోలో కొన్ని మార్పులు చేసి రూపొందించారు...
210
ఈసారి పసుపు, నీలి రంగు వైర్లను వదిలేసి మిగిలిన వైర్లను కట్ చేస్తామని చెబుతుంటారు బాంబ్ స్వ్కార్డ్. మాహీ వారిని వద్దని వారిస్తూ ఉండగానే, బాంబ్ పేలిపోతుంది...
310
‘కేవలం పసుపు, నీలి రంగు జట్లు మాత్రమే పేలుతాయని అనుకుంటే ఎలా? ప్రతీ ఫ్రాంఛైజీతోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే...’ అంటూ హెచ్చరించాడు మహేంద్ర సింగ్ ధోనీ...
410
నీలి రంగు జెర్సీ ఉండే ముంబై ఇండియన్స్... ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవగా, పసుపు పచ్చ జెర్సీ ఉండే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే...
510
ఐపీఎల్ 2020 సీజన్‌లో కనీసం ప్లేఆఫ్స్‌కి కూడా చేరకుండా ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్... ఆ తర్వాతి సీజన్‌లోనే అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి నాలుగోసారి టైటిల్ గెలిచింది...
610
11 సీజన్లలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి, 9 సార్లు ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది సీఎస్‌కే. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ ఆడేందుకు మిగిలిన జట్లన్నీ 60 రోజుల పాటు పోటీపడతాయని వ్యంగ్యంగా చెబుతారు క్రికెట్ ఫ్యాన్స్...
710
అయితే 10 ఫ్రాంఛైజీలు పాల్గొనే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏ జట్టునీ తక్కువ అంచనా వేయడానికి లేదంటున్నాడు ఎమ్మెస్ ధోనీ...
810
40 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ప్లేయర్‌గా ఆఖరి సీజన్ అని ప్రచారం జరుగుతోంది. గత సీజన్‌లో సీఎస్‌కే, టైటిల్ గెలిచినా మాహీ బ్యాటు నుంచి మెరుపులు చూసే అవకాశం దొరకలేదు...
910
ఈసారి అయినా మాహీ బ్యాటు నుంచి వచ్చే మెరుపులు చూడాలని కోరుకుంటున్నారు ఎమ్మెస్ ధోనీ ఫ్యాన్స్. నెల రోజుల ముందు నుంచే నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు ధోనీ...
1010
ఎమ్మెస్ ధోనీ ఆఖరి ఐపీఎల్ సీజన్ కావడంతో ఈసారి కూడా టైటిల్ గెలిచి, ఘనంగా మాహీకి వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్...