ఐపీఎల్‌లో దెబ్బ! ఢాకా ప్రీమియర్ లీగ్‌కి హనుమ విహారితో మరో ఆరుగురు భారత ప్లేయర్లు...

Published : Mar 15, 2022, 08:07 PM IST

ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని భారత ప్లేయర్లు, ఆ రెండున్నర నెలలు ఖాళీగా ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా... కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు ఇంగ్లాండ్‌కి వెళ్తుంటే... హనుమ విహారి సహా ఏడుగురు భారత ప్లేయర్లు... ఢాకా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనబోతున్నారు...

PREV
19
ఐపీఎల్‌లో దెబ్బ! ఢాకా ప్రీమియర్ లీగ్‌కి హనుమ విహారితో మరో ఆరుగురు భారత ప్లేయర్లు...

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్ ప్లేయర్‌గా వచ్చి ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి...  2020 నుంచి మూడు సీజన్లుగా ఐపీఎల్‌లో హనుమ విహారిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రావడం లేదు... 

29

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున చివరిగా ఆడిన హనుమ విహారి, 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరుపున ఆడిన మొదటి మ్యాచ్‌లోనే క్రిస్ గేల్ వికెట్ తీయడంతో పాటు, బ్యాటింగ్‌లో 46 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

39

టీ20 కెరీర్‌లో 74 మ్యాచుల్లో 1355 పరుగులు చేసిన హనుమ విహారి, బౌలింగ్‌లోనూ 22 వికెట్లు పడగొట్టాడు. అయితే స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉండడం, టెస్టు ప్లేయర్‌గా ముద్ర పడడంతో ఐపీఎల్‌లో విహారికి పెద్దగా అవకాశాలు రాలేదు... 

49

ఐపీఎల్‌లో అమ్ముడుపోకపోవడంతో మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే ఢాకా ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనబోతున్నాడు హనుమ విహారి...

59

వాస్తవానికి భారత ప్లేయర్లు, విదేశీ లీగుల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు. అలా విదేశీ ఫ్రాంఛైజీ లీగుల్లో పాల్గొనడానికి వీలులేదు. అయితే ఢాకా ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ లిస్టు ఏ క్రికెట్ టోర్నీ. దేశవాళీ టోర్నీలైనటువంటి లిస్టు ఏ, ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతి ఉంటుంది...
 

69

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో అమ్ముడుపోని పహనుమ విహారితో పాటు అభిమన్యు ఈశ్వరన్, పర్వేజ్ రసూల్, బాబా అపరాజిత్, అశోక్ మెనరియా, చిరాగ్ జానీ, గురిందర్ సింగ్... ఢాకా ప్రమియర్ లీగ్‌ 2022లో పాల్గొనబోతున్నారు. 

79

ఇంతకుముందు భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌తో పాటు పర్వేజ్ రసూల్, ఉదయ్ కౌల్, ఉన్ముక్త్ చంద్, అభిషేక్ నాయర్‌లకు ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అనుభవం ఉంది. 

89

పర్వేజ్ రసూల్, షేక్ జమాల్ దన్‌మోండి జట్టు తరుపున, బాబా అపరాజిత్, రూప్‌గంజ్ టైగర్స్ టీమ్‌ తరుపున, అశోక్ మెనరియా, ఖేలఘర్ జట్టు తరుపున, చిరాగ్ జానీ, లెజెండ్స్ ఆఫ్ రూప్‌గంజీ, గురిందర్ సింగ్, ఘజీ గ్రూప్ ఆఫ్ క్రికెటర్స్ జట్ల తరుపున బరిలో దిగబోతున్నారు...

99

11 జట్లు పాల్గొనే ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అబహానీ లిమిటెడ్ టీమ్‌ తరుపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు హనుమ విహారి...

click me!

Recommended Stories