ఇది పిల్లల పని కాదు! వరల్డ్ నెం.1 బ్యాటర్‌‌ని కావాలనే అవమానించారు... వరల్డ్ కప్ ప్రోమోపై పాక్ మాజీ కెప్టెన్..

Published : Jul 26, 2023, 01:29 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఐసీసీ రూపొందించిన ప్రోమోపై పాకిస్తాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ ప్రోమోలో బాబర్ ఆజమ్‌ని ఓ జోక్‌లా చూపించారని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తంగా చేయగా తాజాగా పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు..

PREV
15
ఇది పిల్లల పని కాదు! వరల్డ్ నెం.1 బ్యాటర్‌‌ని కావాలనే అవమానించారు... వరల్డ్ కప్ ప్రోమోపై పాక్ మాజీ కెప్టెన్..

‘వరల్డ్ కప్ ప్రోమోలో బాబర్ ఆజమ్‌ కనిపించకపోవడం పెద్ద సమస్యేమీ కాదు. అతనేమో నన్ను ప్రోమోలో ఎందుకు చూపించలేదని ఫీలైపోవడం లేదు. కానీ అతని ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అస్సలు సంతోషంగా లేరు. వారి కోపానికి న్యాయం జరగాల్సిందే...
 

25
Rohit Sharma-Babar Azam

ఎందుకంటే వరల్డ్ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్, బెస్ట్ కెప్టెన్ రికీ పాంటింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, ఇయాన్ ఛాపెల్, ఇమ్రాన్ ఖాన్‌ లాంటి వాళ్లను చూపించకుండా మరిచిపోతే కచ్చితంగా తప్పు పట్టాల్సిందే..

35
Babar Azam

నాకు తెలిసి బాబర్ ఆజమ్‌ని మరిచిపోలేదు, కావాలనే పక్కనబెట్టారు. ఎందుకంటే అతను వరల్డ్ నెం.1 వన్డే బ్యాటర్. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అతన్ని చూపించలేదంటే అది వారి స్టేట్ ఆఫ్ మైండ్‌ని చూపిస్తోంది. ఇది పిల్లలు రూపొందించిన ప్రోమో కాదు..

45
Babar Azam

దీన్ని తయారుచేయడానికి ముందు ఓ ప్రణాళిక, కొన్ని నెలల సమయం, ఎంతో శ్రమ ఖర్చు పెట్టి ఉంటారు. అయినా బాబర్ ఆజమ్‌ని చూపించలేదంటే అది కావాలని చేసిన పనే...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్..

55

ఐసీసీ విడుదల చేసిన 2 నిమిషాల 12 సెకన్ల ప్రోమోలో పాక్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిదీ, షాదబ్ ఖాన్, వహబ్ రియాజ్, మహ్మద్ అమీర్ కనిపించారు. భారత్ నుంచి మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు ఇప్పటిదాకా వరల్డ్ కప్ ఆడని శుబ్‌మన్ గిల్‌ని స్పెషల్ అట్రాక్షన్‌గా చూపించింది ఐసీసీ..

click me!

Recommended Stories