తిలక్ వర్మ ఇంట్లో కింద కూర్చొని భోజనం చేసిన రితికా... రోహిత్ శర్మతో అనుబంధంపై..

Published : Jul 26, 2023, 12:29 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడు. టెస్టు ఆరంగ్రేటంలో సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్‌తో పాటు ముకేశ్ కుమార్, తిలక్ వర్మలకు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో అవకాశం కల్పించారు సెలక్టర్లు..

PREV
16
తిలక్ వర్మ ఇంట్లో కింద కూర్చొని భోజనం చేసిన రితికా... రోహిత్ శర్మతో అనుబంధంపై..

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడిన తిలక్ వర్మ, ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 397 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయంతో ఐదు మ్యాచులు ఆడని తిలక్ వర్మ, 11 మ్యాచుల్లో 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు.. 

26

టీమిండియా ఆరంగ్రేటానికి ముందు తిలక్ వర్మ తండ్రి నంబూరి నాగరాజు, రోహిత్ శర్మ, రితికా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఓ ఎలక్ట్రిషన్‌ని. ఆర్థికంగా మా దగ్గర పెద్దగా ఆస్తులేమీ లేవు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ తిలక్ వర్మ ఫోకస్ కోల్పోలేదు. అతని సక్సెస్‌కి పూర్తిగా తన హార్డ్ వర్కే కారణం..

36

కోచ్ సలాం భయాస్, తిలక్ వర్మ టాలెంట్‌పై పూర్తి నమ్మకం పెట్టాడు. అతన జీవితాన్నే మార్చేశాడు. రోహిత్ శర్మ, తిలక్ వర్మకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఫ్రీ ఆడేందుకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే, తిలక్ వర్మ ఎలాంటి ప్రెషర్ లేకుండా ఆడగలిగాడు...

46

ఈ మధ్యే రోహిత్ శర్మ, రితికా ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. టీమిండియా కెప్టెన్‌కి భార్య అయినా రితికా చాలా సింపుల్‌‌గా ఉంది. మా ఇంట్లో కింద కూర్చొని మాతో కలిసి భోంచేసింది. తన సోఫాలో కూర్చోమని చెప్పినా వినలేదు...

56

నేను సోఫాలో కూర్చుంటే మీ ఇంటికి అతిథిగా వచ్చినట్టు, కింద కూర్చుంటే మన ఇంట్లో కూర్చున్నట్టు అంది. ఆ మాటలు విని నాకు ఆశ్చర్యమేసింది. ఈ రోజుల్లో ఇంత వినయంగా ఉండేవాళ్లు చాలా అరుదు...’ అంటూ కామెంట్ చేశాడు తిలక్ వర్మ తండ్రి నాగరాజు.. 

66

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ కోసం సిటీకి వచ్చిన ముంబై ఇండియన్స్ టీమ్, తిలక్ వర్మ ఇంట్లో డిన్నర్ చేసింది. ఈ డిన్నర్‌కి ముంబై ఇండియన్స్ టీమ్ మెంటర్ సచిన్ టెండూల్కర్‌ కూడా వచ్చాడు. 

Read more Photos on
click me!

Recommended Stories