బుమ్రా కాదు.. ఇండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్టు అతడే.. సచిన్ టెండూల్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : May 17, 2022, 03:49 PM IST

Sachin Tendulkar: పొట్టి ఫార్మాట్ లో ముఖ్యంగా ఐపీఎల్ లో  డెత్ ఓవర్లు చాలా కీలకం. రెండో సారి బౌలింగ్ చేసే జట్టుకు  స్కోరును కాపాడుకోవడంలో ఆ నాలుగు ఓవర్లు అత్యంత కీలక పాత్ర  పోషిస్తాయి. 

PREV
18
బుమ్రా కాదు.. ఇండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్టు అతడే.. సచిన్ టెండూల్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం టీమిండియా ఆల్ ఫార్మాట్ ప్లేయర్  జస్ప్రీత్ బుమ్రాను టీ20లలో డెత్ ఓవర్ల (16 నుంచి 20 ఓవర్లు) స్పెషలిస్ట్ గా కీర్తిస్తారు.  చివరి ఓవర్లలో బుమ్రా చేపే మ్యాజిక్ తో  భారత్ కీలక మ్యాచుల్లో విజయం సాధించింది.

28

ఐపీఎల్ లో కూడా బుమ్రా.. ముంబై ఇండియన్స్ తరఫున డెత్ ఓవర్లు వేయడంలో ఫస్ట్ ఛాయిస్.  ఐపీఎల్ లో అయినా  టీమిండియాలో అయినా సారథులు (ఇప్పుడు రెండింటికీ రోహిత్ శర్మే) మొదట చూసేది బుమ్రా వైపే. అయితే  సచిన్ టెండూల్కర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించాడు. 

38

టీ20 ఫార్మాట్ లో కీలకమైన డెత్ ఓవర్లలో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ స్పెషలిస్టు అని.. ప్రస్తుతానికి దేశంలో అతడిని మించిన డెత్ ఓవర్ల  స్పెషలిస్ట్ లేడని కొనియాడాడు. ఇటీవల ఆర్సీబీ-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి సచిన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 

48

ఓ యూట్యూబ్ ఛానెల్ లో సచిన్ మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్ లో పంజాబ్ 209 పరుగులకే పరిమితమైందంటే అది హర్షల్ పటేల్ వల్లే. ప్రతి మ్యాచ్ కూ అతడి బౌలింగ్ మెరుగవుతున్నది. ప్రతి ఓవర్ లోనూ వేరియేషన్ చూపెడుతున్నాడు.. 

58

నా దృష్టిలో ప్రస్తుతం ఇండియాలో డెత్ ఓవర్ల లో అద్భుతంగా బౌలింగ్ చేయగల బౌలర్లలో హర్షల్ ఒకడు. అతడి ప్రతి బంతిలోనూ వైవిధ్యం  స్పష్టంగా కనబడుతున్నది...’ అని తెలిపాడు. 

68

ఆర్సీబీతో మ్యాచ్ లో పంజాబ్.. జానీ బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ ల దూకుడు కారణంగా 240-250 పరుగుల భారీ స్కోరు చేసేలా కనిపించింది.  వాళ్లిద్దరి జోరుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్వుడ్ 4 ఓవర్లలో 64 పరుగులిచ్చుకోగా. మహ్మద్ సిరాజ్ 2 ఓవర్లలోనే 36 పరుగులు సమర్పించుకున్నాడు. 

78

కానీ నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ 34 పరుగులిచ్చి  పంజాబ్ ను కట్టడి చేశాడు. అంతేగాక నాలుగు వికెట్లు కూడా తీశాడు. ఒక్క పంజాబ్ తో మ్యాచ్ లోనే కాదు ఈ సీజన్ లో మొత్తంగా కూడా  హర్షల్  నిలకడగా రాణిస్తున్నాడు.  12 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టాడు. 

88

ఇక ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్ చేరాలంటే  ఆర్సీబీ తాము తదుపరి ఆడబోయే గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో  హర్షల్ కీలక పాత్ర పోషించనున్నాడు.  ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తేనే ఆర్సీబీకి ప్లేఆఫ్ చేరే అవకాశముంటుంది.  

click me!

Recommended Stories