కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీ, ఓపెనర్‌గా రోహిత్, వన్‌డౌన్‌లో విరాట్... షోయబ్ అక్తర్ ఆల్‌టైం ఐపీఎల్ ఎలెవన్‌లో...

First Published May 17, 2022, 3:40 PM IST

ఐపీఎల్ ఆడిన అతి కొద్దిమంది పాకిస్తాన్ క్రికెటర్లలో షోయబ్ అక్తర్ ఒకడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ తోపు అనే వాళ్ల కంటే, ఐపీఎల్‌ ముందు పీఎస్‌ఎల్ ఎందుకు పనికి రాదని చెప్పే నిజాయితీ ఉన్న పాక్ ప్లేయర్ కూడా. తాజాగా ఐపీఎల్‌లో తన ఆల్‌టైం ఫెవరెట్ ప్లేయింగ్ ఎలెవన్ టీమ్‌ని ప్రకటించాడు షోయబ్ అక్తర్...

ఐపీఎల్ 2008 ఆరంగ్రేట సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఆడిన షోయబ్ అక్తర్, అప్పటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనకుండా రెగ్యూలర్ ఫాలో అవుతున్నాడు...

‘నా ఫస్ట్ ఓపెనర్ క్రిస్ గేల్. అతను ఓ విధ్వంకర బ్యాట్స్‌మెన్. క్రిస్ గేల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తే, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం గ్యారెంటీ.. అతను ఓ గొప్ప ప్లేయర్...

Latest Videos


నెం.3 స్థానంలో విరాట్ కోహ్లీ ఉంటాడు. ఇప్పుడు అతని ఫామ్ సరిగా లేకపోయినా విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలను తక్కువ చేయలేం... ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కోహ్లీయేనని మరిచిపోకూడదు...

నాలుగో స్థానంలో ఏబీ డివిల్లియర్స్, ఐదో స్థానంలో ఆండ్రే రస్సెల్, ఆరో స్థానంలో కిరన్ పోలార్డ్‌లను ఆడిస్తా. మిడిల్ ఆర్డర్‌లో ఇలాంటి విధ్వంకర బ్యాట్స్‌మెన్ ఉంటే, ఆ టీమ్‌ని ఎవ్వరైనా ఆపగలరా?

ఏడో స్థానంలో ఎమ్మెస్ ధోనీని ఎంచుకుంటా. అతను ఫినిషర్, హార్డ్ హిట్టర్ కూడా. నా టీమ్‌కి కెప్టెన్ కూడా అతనే. నా టీమ్‌కి ఎమ్మెస్ ధోనీయే లీడర్‌గా ఉంటాడు...

ఆ తర్వాత హర్భజన్ సింగ్, రషీద్ ఖాన్‌లను స్పిన్నర్లుగా ఆడిస్తా. అలాగే ఫాస్ట్ బౌలర్లుగా లసిత్ మలింగ, బ్రెట్ లీ ఉంటారు...’ అంటూ తన ఆల్‌టైం ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి ప్రకటించాడు షోయబ్ అక్తర్...

షోయబ్ అక్తర్ ఐపీఎల్ ఆల్‌టైం ప్లేయింగ్ ఎలెవన్ ఇదే: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, కిరన్ పోలార్డ్, ఆండ్రే రస్సెల్, ఎమ్మెస్ ధోనీ (కెప్టెన్), హర్భజన్ సింగ్, రషీద్ ఖాన్, లసిత్ మలింగ, బ్రెట్ లీ...

click me!