కెప్టెన్ అంటే నీ కింద పనిచేసే ప్యూన్ కాదు... బ్రెండన్ మెక్‌కల్లమ్‌పై సల్మాన్ భట్ ఫైర్..

Published : May 17, 2022, 02:37 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని వేల ఆశలతో మొదలెట్టిన యంగ్ కెప్టెన్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. మయాంక్ అగర్వాల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి కొత్త కెప్టెన్ల మధ్యలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్...

PREV
18
కెప్టెన్ అంటే నీ కింద పనిచేసే ప్యూన్ కాదు... బ్రెండన్ మెక్‌కల్లమ్‌పై సల్మాన్ భట్ ఫైర్..

సీజన్ ఆరంభంలో తన కెప్టెన్సీ స్కిల్స్‌తో క్రికెట్ విశ్లేషకులను మెప్పించిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయాడు. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన కేకేఆర్, ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవడానికి ప్రతీ మ్యాచ్‌లో కష్టపడుతోంది...

28

టీమ్ సెలక్షన్‌లో సీఈవో కూడా జోక్యం చేసుకుంటున్నాడని, చాలా కష్టంగా ఉంటోందని కామెంట్లు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాతి మ్యాచ్‌లోనే మాట మార్చి... అలా అనలేదని చెప్పాడు...

38

శ్రేయాస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలతో కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచింగ్ స్టైల్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

48

‘మెక్‌కల్లమ్‌కి కొన్ని సమస్యలు ఉన్నాయి. అతను దేన్నైనా గుడ్డిగా నమ్ముతాడు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అనే రకం వ్యక్తి. అతనికి పిచ్‌ గురించి తెలీదు, పిచ్ కండీషన్స్ గురించి తెలీదు...

58

ఏ జట్టుపైన ఎంత స్కోరు చేస్తే సరిపోతుందనే కనీస అవగాహన కూడా మెక్‌కల్లమ్‌కి తెలీదు. అతనికి తెలిసింది ఒక్కటే... ఫ్రీగా ఆడాలి, వేగంగా ఆడాలి... ఫియర్ లెస్ క్రికెట్ పేరుతో సెన్స్‌లెస్ క్రికెట్‌ ఆడిస్తున్నాడు...

68

జట్టు ఎంపికలో కెప్టెన్‌కి స్వేచ్ఛ ఉండాలి. ఎవరైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. అంతేకానీ కెప్టెన్ నీ కింద పని చేసే ప్యూన్ కాదు, నువ్వు చెప్పిదల్లా తల ఊపుతూ చెయ్యడానికి...

78

ఇంతకుముందు మెక్‌కల్లమ్‌ని లాహోర్ ఖలందర్స్‌లో చూశాం. అతను ఫియర్‌ లెస్ క్రికెట్ పేరుతో ఎన్ని బుర్రతక్కువ పనులు చేశాడో నాకు బాగా తెలుసు...

88
salman butt

15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా లోయర్ ఆర్డర్‌లో వచ్చే బౌలర్లు కూడా అటాకింగ్ గేమ్ ఆడాలని చెబుతాడు మెక్‌కల్లమ్. అతనికి పిచ్‌తో, ప్లేయర్ల కెపాసిటీతో సంబంధం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్... 

click me!

Recommended Stories