
ఐపీఎల్ 2022 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన 11 మందితో బెస్ట్ ఐపీఎల్ 2022 సీజన్ జట్టును ప్రకటించాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సచిన్ లిస్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు చోటు దక్కకపోవడం విశేషం...
జోస్ బట్లర్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన జోస్ బట్లర్‌ని తన ఐపీఎల్ 2022 టీమ్‌కి ఓపెనర్‌గా ఎంచుకున్నాడు సచిన్ టెండూల్కర్. బట్లర్ వల్లే రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ వచ్చిందంటూ కామెంట్ చేశాడు. ‘ఈ సీజన్ జోస్ బట్లర్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సీజన్‌లో బట్లర్ కంటే డేంజరస్ ప్లేయర్‌ని నేను చూడలేదు...’ అంటూ చెప్పాడు సచిన్ టెండూల్కర్..
శిఖర్ ధావన్... పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఈ సీజన్‌లో కూడా మంచి పర్పామెన్స్ ఇచ్చాడు. ‘ప్లేయర్ల పేర్లు, ఖ్యాతిని చూసి కాకుండా, ఈ సీజన్‌లో వారి పర్ఫామెన్స్ కారణంగానే నేను జట్టును ఎంచుకున్నా. శిఖర్ ధావన్ దూకుడుగా ఆడగలడు, స్ట్రైయిక్ రొటేట్ చేయగలడు. అతని పర్ఫామెన్స్ టీమ్‌కి ఎంతో ఉపయోగపడింది...’ అంటూ కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్.
కెఎల్ రాహుల్.. ఈ సీజన్‌లో 15 మ్యాచల్లో 616 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచాడు రాహుల్. ‘రాహుల్ నిలకడగా పరుగులు చేయడం నాకెంతో నచ్చుతుంది. సింగిల్స్ తీస్తూ, సిక్సర్లు బాదగల ప్లేయర్లలో కెఎల్ రాహుల్ ఒకడు...’ అంటూ లక్నో కెప్టెన్‌ని ప్రశించాడు సచిన్ టెండూల్కర్..
హార్ధిక్ పాండ్యా... ‘పాండ్యా ఈ సీజన్‌లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను కెఎల్ రాహుల్‌లాగే సిక్సర్లు బాదగలడు, అవసరమైతే సింగిల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేయగలడు. అదీకాక పాండ్యా ఓ చక్కని బౌలర్ కూడా. అందుకే అతన్ని నా టీమ్‌కి కెప్టెన్‌గా ఎంచుకున్నా...’ అంటూ ఐపీఎల్ 2022 టైటిల్ విన్నర్‌ని పొగడ్తల్లో ముంచెత్తాడు టెండూల్కర్...
డేవిడ్ మిల్లర్... గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు డేవిడ్ మిల్లర్. ఈ సీజన్‌లో 480కి పైగా పరుగులు చేసి, ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ‘మిల్లర్ లెఫ్ట్ హ్యాండర్. రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండర్ పార్టనర్‌షిప్‌కి బాగా పనికొస్తున్నాడు. అతను ఈ సీజన్‌లో ఆడిన విధానం వెలకట్టలేనిది. మిల్లర్ షాట్స్ ఆడే విధానం చూడచక్కగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు టెండూల్కర్..
లియామ్ లివింగ్‌స్టోన్... ఈ సీజన్‌లో ఐదు హాఫ్ సెంచరీలు అదరగొట్టాడు పంజాబ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్. ‘లివింగ్‌స్టోన్ ఓ డేంజరస్ ప్లేయర్. అతను ఎంతో ఈజీగా సిక్సర్లు కొట్టగలడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే లివింగ్‌స్టోన్, మంచి స్పిన్ బౌలర్ కూడా...’ అంటూ పంజాబ్ ఆల్‌రౌండర్‌ని ప్రశంసించాడు మాస్టర్...
దినేశ్ కార్తీక్... ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఫినిషర్‌గా మారాడు దినేశ్ కార్తీక్. ‘ఈ సీజన్‌లో దినేశ్ కార్తీక్ అసాధారణంగా రాణించాడు. చాలా కూల్‌గా తన పనేదో చేసుకుంటూపోయాడు. అతని షాట్స్ కంట్రోల్ సూపర్బ్.. 360 డిగ్రీస్‌లో షాట్స్ ఆడగల కార్తీక్, డేంజరస్ బ్యాటర్...’ అంటూ భారత సీనియర్ వికెట్ కీపర్‌ను మెచ్చుకున్నాడు టెండూల్కర్...
రషీద్ ఖాన్.. ‘రషీద్ ఖాన్ బ్యాటర్‌గా ప్రత్యర్థులను భయపెట్టగలడు. పరుగులు ఇవ్వకుండా వికెట్ల తీస్తూ ఒత్తిడిలో నెట్టేయగలడు. ఏ కెప్టెన్‌కి అయినా ఇంతకంటే ఏం కావాలి...’ అంటూ టైటాన్స్ ఆల్‌రౌండర్‌ని ప్రశంసించాడు సచిన్ టెండూల్కర్...
మహ్మద్ షమీ.. ‘షమీ పవర్ ప్లేలో వికెట్లు తీయగలడు, డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా నియంత్రించగలడు. అతని అనుభవం జట్టుకి ఎంతో అవసరం. టైటాన్స్ టైటిల్ గెలవడంలో షమీ పాత్ర చాలా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్..
జస్ప్రిత్ బుమ్రా.. ‘ప్రపంచంలో ఉన్న బెస్ట్ డెత్ ఓవర్ బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా ఒకడు. ఎంతోమంది కొత్త పేసర్లు వస్తున్నా, బుమ్రా స్థానం మాత్రం ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు...’ అంటూ భారత స్టార్ పేసర్‌ని ప్రశంసించాడు సచిన్ టెండూల్కర్.
యజ్వేంద్ర చాహాల్.. ‘ఈ సీజన్‌లో చాహాల్ హైయెస్ట్ వికెట్ టేకర్. చాహాల్ చాలా స్మార్ట్ క్రికెటర్. రషీద్ ఖాన్, చాహాల్ కలిసి బౌలింగ్ చేస్తే, ఏ బ్యాట్స్‌మెన్ అయినా ఇబ్బంది పడాల్సిందే...’ అంటూ కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్...
మొత్తంగా సచిన్ టెండూల్కర్ ఎంచుకున్న ఐపీఎల్ 2022 సీజన్ బెస్ట్ టీమ్ ఇదే: జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేశ్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్.
సచిన్ ప్రకటించిన టీమ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీలకు చోటు దక్కగా రాజస్థాన్ రాయల్స్ నుంచి జోస్ బట్లర్, యజ్వేంద్ర చాహాల్‌లకు చోటు దక్కింది. లక్నో నుంచి కెఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ నుంచి శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆర్‌సీబీ నుంచి దినేశ్ కార్తీక్, ముంబై ఇండియన్స్ నుంచి జస్ప్రిత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒక్క ప్లేయర్‌కి కూడా సచిన్ టీమ్‌లో చోటు దక్కలేదు.