ఐపీఎల్‌లో కర్ణ్ శర్మకు చాలా స్పెషల్ ఐడెంటిటీ ఉంది. 9 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నా, కర్ణ్ శర్మ ఇప్పటిదాకా ఆడింది 68 మ్యాచులే. అయితే గత ఐదు సీజన్లలో మూడు సార్లు టైటిల్ గెలిచిన టీమ్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు... అయితే అతని రికార్డును మరో ప్లేయర్ చెదరగొడుతున్నాడు. ఆ ప్లేయర్ పేరు డొమినిక్ డ్రాక్స్...
కర్ణ్ శర్మ ఇప్పటిదాకా మూడు జట్ల తరుపున ఐపీఎల్ గెలిచాడు. 2016 సీజన్‌లో ఆర్‌సీబీని ఓడించి, టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉన్న కర్ణ్ శర్మ, ఆ తర్వాతి ఏడాది ముంబై ఇండియన్స్‌కి మారాడు...
27
2017 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ టైటిల్ గెలిచిన కర్ణ్ శర్మ, 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మారాడు. సీఎస్‌కే, కర్ణ్ శర్మను రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2018లో సన్‌రైజర్స్‌ని ఫైనల్‌లో ఓడించి, సీఎస్‌కే టైటిల్ గెలిచింది...
37
వరుసగా మూడు సీజన్లలో మూడు వేర్వేరు జట్ల తరుపున ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కర్ణ్ శర్మ... 2021 సీజన్‌లోనూ సీఎస్‌కే టైటిల్ గెలిచినప్పుడు అందులోనే ఉన్నాడు కర్ణ్ శర్మ.
47
ఇలా నాలుగు టైటిల్స్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్న కర్ణ్ శర్మను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. అతని లక్ కలిసి వచ్చి, టీమ్‌కి టైటిల్ వస్తుందని ఆశలు పెట్టుకుంది. అయితే ఆర్‌సీబీ బ్యాడ్ లక్‌ని కర్ణ్ శర్మ అదృష్టం కూడా కాపాడలేకపోయింది...
57
కర్ణ్ శర్మ ఒకటో రెండో మ్యాచులు ఆడి టైటిల్స్ గెలిస్తే, రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్ ఆడకుండా రెండు టైటిల్స్ గెలిచాడు డొమినిక్ డ్రాక్స్...
67
Suvarna IPL 2022-Dominic Drakes
వెస్టిండీస్ ప్లేయర్ డొమినిక్ డ్రాక్స్‌ని గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఈ సీజన్‌లో రూ.1.1 కోట్లకు డొమినిక్‌ని కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. ఈసారి కూడా అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
77
Image Credit: PTI
ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా రెండు సీజన్లలో రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన డొమినిక్ డ్రాక్స్, కర్ణ్ శర్మకు తెగ పోటీ ఇస్తాడని అంటున్నారు ఐపీఎల్ అభిమానులు... ఇది ఇలాగే కొనసాగితే ప్రతీ టీమ్ డొమినిక్ డ్రాక్స్‌ని కొనుగోలు చేసి, ఒక్క మ్యాచ్ ఆడించకుండా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతుందేమో...