‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్, ఎందరో నాటి, నేటి యువ క్రికెటర్లకు ఫెవెరెట్. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు, కొన్ని వందల రికార్డులు క్రియేట్ చేసిన సచిన్ టెండూల్కర్, ఆల్‌టైం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు...
ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్: భారత విధ్వంసక బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు సచిన్ టెండూల్కర్...
213
వన్‌డౌన్‌లో బ్రియాన్ లారా: టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విండీస్ మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారాని వన్ డౌన్ ప్లేయర్‌గా ఎంచుకున్నాడు సచిన్ టెండూల్కర్...
313
టూ డౌన్‌లో వీవిన్ రిచర్డ్స్: సచిన్ టెండూల్కర్ ఆల్‌టైం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో విండీస్ దిగ్గజం వీవిన్ రిచర్డ్స్‌కి టూ డౌన్ ప్లేయర్‌గా చోటు దక్కింది...
413
ఐదో స్థానంలో జాక్వస్ కలీస్: టెస్టుల్లో 13 వేలకు పైగా పరుగులు, 292 వికెట్లు తీసిన సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్‌కి సచిన్ టీమ్‌లో ఐదో స్థానంలో బ్యాట్స్‌మెన్‌గా, ఆల్‌రౌండర్‌గా చోటు దక్కింది...
513
సౌరవ్ గంగూలీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కూడా సచిన్ టెండూల్కర్, ఆల్‌టైం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది...
613
ఆడమ్ గిల్‌క్రిస్ట్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని తన టీమ్‌కి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్.. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌కి కూడా ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్ ఆల్ టైం బెస్ట్ ఎలెవన్‌లో ప్లేస్ దక్కింది...
713
వసీం అక్రమ్: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ పేసర్ వసీం అక్రమ్... టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ బెస్ట్ టీమ్‌లో చోటు దక్కింది...
813
హర్భజన్ సింగ్: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో నాలుగో స్థానంలో ఉన్న హర్భజన్ సింగ్‌ను స్పిన్నర్‌గా ఎంచుకున్న సచిన్ టెండూల్కర్, ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను ఫాస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నాడు...
913
సచిన్ టెండూల్కర్ టీమ్‌లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే వంటి దగ్గజాలకు చోటు దక్కలేదు...
1013
భారత జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లేని కాదని హర్భజన్ సింగ్‌ను ఎంచుకోవడం, రాహుల్ ద్రావిడ్‌ని కాదని సౌరవ్ గంగూలీని ఎంచుకోవడం చూస్తుంటే... సచిన్... తాను ఎంజాయ్ చేసిన ప్లేయర్లను టీమ్‌గా ఎంపిక చేసినట్టు ఉందని అంటున్నారు అభిమానులు...
1113
సచిన్ టెండూల్కర్ 194 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడనే కోపంతోనే రాహుల్ ద్రావిడ్‌ని బెస్ట్ ఎలెవన్‌లో ఎంపిక చేయలేదని ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు...
1213
Sachin Tendulkar
మరీ ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ టీమ్‌లో అతనికే చోటు ఇచ్చుకోలేదు మాస్టర్. దీంతో సచిన్. ఏదో మొహమాటానికి 11 మంది దిగ్గజ క్రికెటర్ల పేర్లను చెప్పి ఉంటాడని కూడా ట్రోల్స్ వినిపిస్తున్నాయి.