సెంచూరియన్ టెస్టు గెలిచి, విజయంతో సఫారీ టూర్‌ను ఆరంభించింది టీమిండియా. అయితే రెండో టెస్టులో మాత్రం భారత ఆట అనుకున్నంత సాఫీగా సాగలేదు. దీంతో విజయావకాశాలు ఇరుజట్లకీ సమానంగా ఉన్నట్టే కనిపిస్తున్నా, ఆతిథ్య జట్టువైపే ఎక్కువ ఛాన్సులున్నాయి...
మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 118 పరుగులు చేసింది సౌతాఫ్రికా. రెండు వికెట్లు కోల్పోయినా, ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి...
29
కెప్టెన్ డీన్ ఎల్గర్ 46 పరుగులతో, వాన్ దేర్ దుస్సేన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. కావాల్సింది ఇంకా 122 పరుగులు మాత్రమే... దీంతో ఫలితం తేలడం పక్కాగా మారింది...
39
కొట్టాల్సింది 122 పరుగులే కావడంతో టీమిండియా విజయం సాధించాలంటే, భారత బౌలర్ల నుంచి అద్భుతమైన ప్రదర్శన రావాల్సిన పరిస్థితి...
49
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టు విజయం అందుకోవాలంటే బుమ్రానే కీలకం. అతని ప్రదర్శనే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతోందని భావిస్తున్నా...
59
ఎందుకంటే భారత జట్టు బౌలింగ్ అటాక్‌కి బుమ్రాయే సారథి. అతని బౌలింగ్, మిగిలిన బౌలర్ల పర్ఫామెన్స్‌ను ప్రభావితం చేస్తుంటుంది...
69
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, ప్రత్యర్థిని ఇబ్బందిపెడితే, వికెట్లు వాటంతట అవే వస్తాయి. బుమ్రా ఇన్ స్వింగర్స్, అవుట్స్ స్వింగర్స్, యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...
79
‘నేను, బుమ్రాని ఇక్కడే చూశాను. సౌతాఫ్రికాలోనే అతని టెస్టు ఆరంగ్రేటం చేశాడు. ఇన్నేళ్లలో అతనే అద్భుతమైన బౌలర్‌గా మారాడు. బుమ్రాని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు...
89
మిగిలిన బౌలర్లతో బుమ్రా బౌలింగ్ భాగస్వామ్యం ఎలా ఉంటుందనేది చాలా కీలకం. కొన్నిసార్లు బుమ్రా తన మెరుపు బౌలింగ్‌లో బ్యాటర్‌కి నిద్రలేకుండా చేయగలడు...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నే మోర్కెల్...
99
తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లు తీయగా, మహ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు. బుమ్రాకి ఓ వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.