పృథ్వీషాని పంపేది లేదు, ఉన్నవాళ్లను ఆడించండి... టీమిండియాకి షాక్ ఇచ్చిన సెలక్టర్లు...

First Published Jul 9, 2021, 12:35 PM IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు గాయపడిన శుబ్‌మన్ గిల్ స్థానంలో యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషాని పంపాలని విరాట్ కోహ్లీ అండ్ టీమ్ కోరిన కోరికకు టీమిండియా సెలక్టర్ల నుంచి ఊహించిన రెస్పాన్స్ వచ్చింది. పృథ్వీషాను పంపేది లేదని తేల్చేశారు సెలక్టర్లు...

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు శుబ్‌మన్ గిల్ గాయపడడంతో అతని స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీషాని ఇంగ్లాండ్‌కి పంపాలని సెలక్టర్లను కోరారు భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి...
undefined
పృథ్వీషాతో పాటు మరో బ్యాట్స్‌మెన్‌గా దేవ్‌దత్ పడిక్కల్‌ను కూడా ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలంటూ సెలక్టర్లను కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ డిమాండ్‌ను సెలక్టర్లు తిరస్కరించారు...
undefined
ప్రస్తుతం శ్రీలంక‌తో వన్డే, టీ20 సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్... ఈ టూర్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌కి వెళ్తారని వార్తలు వచ్చినా... వారిని పంపేందుకు సెలక్టర్లు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది...
undefined
ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన జట్టులో ఓపెనింగ్ స్లాట్ కోసం ఎంపికైన మయాంక్ అగర్వాల్ సిద్ధంగా ఉన్నాడు. కెఎల్ రాహుల్‌కి కూడా టెస్టుల్లో ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది...
undefined
వీరిద్దరే కాకుండా స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్ కూడా ఓపెనింగ్ చేయగలడు. దీంతో ఈ ముగ్గురూ ఉండగా మరో ఓపెనర్‌ అనవసరమని సూచించిన సెలక్టర్లు, పృథ్వీషాను పంపడం కుదరదని తేల్చేశారట...
undefined
‘ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన జట్టులో పృథ్వీషా లేడు. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం 24 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. ఇప్పుడు ఆ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు...’ అని ఓ బీసీసీఐ అధికారి కామెంట్ చేశాడు...
undefined
‘దేవ్‌దత్ పడిక్కల్ చాలా టాలెంటెడ్ యంగ్ స్టర్. అతన్ని ఇలా అర్ధాంతరంగా పంపాల్సిన అవసరం లేదు. అతనికి టైం వస్తుంది. అప్పుడు జట్టుతో పాటు ఎంపికై ఆడతాడు’ అంటూ కామెంట్ చేశాడు సదరు అధికారి...
undefined
పృథ్వీషా ఇంగ్లాండ్ టూర్‌కి రావడం లేదని తేలిపోవడంతో రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకటి రెండ టెస్టుల్లో మయాంక్ అగర్వాల్ పర్ఫామెన్స్ బాగోలేకపోతే అతని స్థానంలో కెఎల్ రాహుల్‌ను ఓపెనింగ్‌ పంపించే అవకాశం ఉంది...
undefined
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో విఫలమైన ఛతేశ్వర్ పూజారా స్థానంలో కెఎల్ రాహుల్ లేదా హనుమ విహారిలను ఆడించాలని టీమిండియా భావిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆగస్టు 4న టెస్టు సిరీస్ మొదలైతే కానీ పూజారా ఉంటాడా? లేదా? అనేది తేలదు...
undefined
click me!