గతి లేక ఉమేశ్ యాదవ్‌ని సెలక్ట్ చేశామన్నట్టు రోహిత్ శర్మ కామెంట్స్... ఆ ఇద్దరూ గాయపడడం వల్లే...

Published : Sep 19, 2022, 05:12 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు ఆడుతోంది భారత జట్టు. ఆసియా కప్ 2022 రిజల్ట్ కారణంగా ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని మహ్మద్ షమీన, టీ20 సిరీస్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మహ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు...

PREV
16
గతి లేక ఉమేశ్ యాదవ్‌ని సెలక్ట్ చేశామన్నట్టు రోహిత్ శర్మ కామెంట్స్... ఆ ఇద్దరూ గాయపడడం వల్లే...

సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతని ప్లేస్‌లో మరో సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఐపీఎల్ 2022 సీజన్‌లో, రాయల్ లండన్ వన్డే కప్‌ టోర్నీలో ఉమేశ్ యాదవ్ ఇచ్చిన ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ కారణంగా అతనికి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో చోటు దక్కింది...

26
Image credit: Getty

‘మహ్మద్ షమీ స్థానంలో కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అయితే ప్రసిద్ధ్ కృష్ణ గాయపడ్డాడు. నవ్‌దీప్ సైనీ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. మహ్మద్ సిరాజ్ ఏమో కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు...

36
Image credit: Getty

ఆసియా కప్‌లో ఆడిన ఆవేశ్ ఖాన్‌ అనారోగ్యంతో బాధపడుతూ ఇంకా కోలుకోలేదు. అందుకే ఇక షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ని సెలక్ట్ చేయాల్సి వచ్చింది. వీటితో పాటు ఉమేశ్ యాదవ్ పర్ఫామెన్స్‌ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం...

46

మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. వాళ్లు ఏ సమయంలో అయినా ఏ ఫార్మాట్ అయినా ఆడడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఏ ఫార్మాట్‌లో అయినా రాణించగలమని నిరూపించుకున్న ప్లేయర్లు ఈ ఇద్దరూ...

56
Image credit: PTI

ఈ ఇద్దరూ ఫిట్‌గా ఉంటే కచ్ఛితంగా జట్టులో చోటు దక్కుతుంది. ఫామ్‌తో సంబంధం లేదు. ఐపీఎల్‌లో ఉమేశ్ యాదవ్ ఎలా బౌలింగ్ చేశాడో చూశారుగా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
 

66
rohit sharma

మొదటి టీ20 ఆరంభానికి ముందు రోహిత్ శర్మ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా సీనియర్ అవసరం కాబట్టి ఉమేశ్ యాదవ్‌ని సెలక్ట్ చేశామని ఉంటే సరిపోయేదని.. రోహిత్ అలా చెప్పకుండా ప్రసిద్ధ్, సిరాజ్, ఆవేశ్ అందుబాటులో లేకపోవడంతో గతి లేక ఉమేశ్ యాదవ్‌ని ఎంపిక చేశామన్నట్టు కామెంట్ చేయడం సరికాదని అంటున్నారు...

Read more Photos on
click me!

Recommended Stories