రవీంద్ర జడేజా లేని లోటు, అతను తీరుస్తాడు... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

First Published Sep 19, 2022, 4:45 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జడ్డూ కోలుకోవడానికి మూడు నెలల సమయం పడుతుందని అంచనా. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో జడ్డూ లేకుండానే బరిలో దిగుతోంది టీమిండియా...

Image credit: PTI

బ్యాటుతో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తున్న రవీంద్ర జడేజా లేని లోటు టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే కామెంట్ చేశాడు. ఐదో స్థానంలో కుదురుకుపోయిన జడ్డూ ప్లేస్‌లో అతనిలా ఆడే ప్లేయర్‌ని వెతికి పట్టుకోవడం ఇప్పట్లో అయ్యే పని కాదని కామెంట్ చేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రవీంద్ర జడేజా లేని లోటు తీర్చగల సత్తా టీమిండియా ప్లేయర్లలో ఉందని అంటున్నాడు రోహిత్ శర్మ...

jadeja

‘రవీంద్ర జడేజా దూరం కావడంతో టీమ్‌లో ఓ స్పిన్ ఆల్‌రౌండర్ అవసరం పడ్డాడు. అయితే అక్షర్ పటేల్ ఆ లోటు తీర్చగలడు. అతనిలో బ్యాటింగ్ చేయగల సత్తా పుష్కలంగా ఉంది. ఇప్పటికే చాలా సార్లు అక్షర్ తన బ్యాటింగ్ టాలెంట్‌ని నిరూపించుకున్నాడు కూడా...

జడేజా అందుబాటులో లేనప్పుడు అక్షర్ పటేల్‌ని ఆడించాలనే ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అదే ప్లాన్‌ని టీ20 వరల్డ్ కప్‌లో అమల చేయబోతున్నాం. జడ్డూ లేని లోటు తెలియకుండా అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇవ్వగలడని నమ్ముతున్నాం...

jadeja

వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో కూడా అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్‌ని సింగిల్ హ్యాండెడ్‌గా గెలిపించాడు. అదీకాకుండా అతను త్రీ ఫేస్ బౌలర్. అక్షర్ పటేల్‌ని పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో కూడా వాడుకోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

Axar Patel

టీమిండియా తరుపున ఇప్పటిదాకా 11 టీ20 మ్యాచులు ఆడిన అక్షర్ పటేల్ 8.32 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో వన్డేలో 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసి... భారత జట్టుకి విజయాన్ని అందించాడు అక్షర్ పటేల్...

click me!