టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు 16 జట్ల కెప్టెన్లతో కలిసి ఫోటో సెషన్స్ నిర్వహించింది ఐసీసీ. ఈ ఈవెంట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు తన స్టైల్‌లో సమాధానాలు ఇచ్చాడు రోహిత్ శర్మ...
Image credit: Getty
‘పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. అది కూడా ఓ సాధారణ మ్యాచ్‌గానే భావిస్తున్నాం. మొదటి మ్యాచ్‌ని విజయంతో ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఆటలో గాయాలు కూడా అంతర్భాగమే.. వాటిని తప్పించలేం...
Jasprit Bumrah
ఇన్ని మ్యాచులు ఆడుతున్నప్పుడు గాయపడకుండా ఉండడం కష్టం. అందుకే మేం గత ఏడాది నుంచి బెంచ్ స్ట్రెంగ్త్‌ని క్రియేట్ చేస్తూ వచ్చాం. ఎవరికి అవకాశం వచ్చినా ఆడేందుకు సిద్ధంగా ఉండేలా ప్రిపేర్ చేశాం. కుర్రాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు...
bumrah
జస్ప్రిత్ బుమ్రా గాయపడిన తర్వాత అతని రిప్లేస్ చేసే బౌలర్‌ని ఇమ్మని సెలక్టర్లను కోరాం. అయితే బుమ్రాని ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. అయితే భారత బౌలింగ్ విభాగం వీక్ కాలేదు. చాలామంది సత్తా ఉన్న బౌలర్లు ఉన్నారు...
Image credit: Getty
మహ్మద్ షమీని ఆడించాలని నిర్ణయం తీసుకున్నాక అతను కరోనా బారిన పడ్డాడు. రెండు మూడు వారాలు కరోనా నుంచి కోలుకోవడానికే పట్టింది, ఆ తర్వాత ఎన్‌సీఏకి వెళ్లి రిహాబ్ తీసుకున్నాడు. ఇప్పుడు బ్రిస్బేన్‌కి చేరుకున్నాడు...
Mohammed Shami
పెర్త్‌లో ఉన్న భారత జట్టు, బ్రిస్బేన్‌కి వెళ్లబోతోంది. అక్కడ మాకో ప్రాక్టీస్ సెషన్ ఉంది. షమీ కూడా ఆ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటాడు. ఇప్పటిదాకా షమీ గురించి పాజిటివ్ వార్తలే వస్తున్నాయి. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడు, కరెక్ట్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తున్నాడు...
Image credit: Getty
జస్ప్రిత్ బుమ్రా క్వాలిటీ బౌలర్. అయితే అతను గాయపడడం మాకు నిజంగా షాకే. ఎంతో మంది స్పెషలిస్టులు బుమ్రా గాయాన్ని పరిశీలించారు. వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ రాలేదు. వరల్డ్ కప్ చాలా ముఖ్యమే అయితే అంతకంటే బుమ్రా కెరీర్ విలువైనది...
Image credit: Getty
బుమ్రా అందుబాటులో ఉంటే ఇలాంటి ఎన్నో వరల్డ్ కప్‌లు ఆడగలడు. అతనికి ఇప్పుడు 27-28 ఏళ్లే. చాలా క్రికెట్ కెరీర్ ముందుంది. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, స్పెషలిస్టులు చెప్పినట్టే బుమ్రాని పక్కనబెట్టాం..
Image credit: PTI
సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పుడున్న ఫామ్‌లో బ్యాటింగ్ చేయడం మాకు చాలా ముఖ్యం. మిడిల్ ఆర్డర్‌లో సూర్య చేసే పరుగులు మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. నిర్భయంగా బ్యాటింగ్ చేసే సూర్య స్కిల్స్ మాకు ఎక్స్-ఫ్యాక్టర్ అవుతాయని అనుకుంటున్నాం... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ...
Rohit Sharma
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ 2లో ఉన్న టీమిండియా, తొలి మ్యాచ్ అక్టోబర్ 23న పాకిస్తాన్‌తో ఆడనుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో మ్యాచులు ఆడుతుంది. గ్రూప్ క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే మరో రెండు జట్లతో మ్యాచులు ఉంటాయి.